Daksha Nagarkar: అప్పటికి నాకంత మెచ్యూరిటీ లేదు.. ఇప్పుడైతే ఒప్పేసుకునేదాన్ని.. జాంబిరెడ్డి మ్యాగీ ముచ్చట్లు..
Daksha Nagarkar: తేజ సజ్జ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన
Daksha Nagarkar: తేజ సజ్జ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ దక్షా నగార్కర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగులో తన మొదటి చిత్రం ‘హోరా హోరీ’ అని బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తేజాగారి దర్శకత్వంలో ఆ సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పింది.
చదువు కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంలో నటించానని పేర్కొంది. ప్రశాంత్ వర్మ తీసిన ‘అ’ చిత్రంలో నిత్యామీనన్ పాత్రలో తాను నటించాల్సిందని, అయితే అప్పటికి తనకంత మెచ్యూరిటీ లేదని ఇప్పుడైతే ఆ పాత్రని ఒప్పుకునేదాన్నని వెల్లడించింది. ‘కల్కి’కి కూడా సంప్రదించారని కానీ కుదరలేదని తెలిపింది. మూడోసారి మిస్ కాకూడదని ‘జాంబీ రెడ్డి’ చేశానని చెప్పుకొచ్చింది. ఇందులో మ్యాగీ అనే గేమర్ పాత్రలో నటించానని, ప్రస్తుతం బెల్లంకొండ గణేశ్‌తో మరో సినిమా చేస్తున్నానని తెలిపింది.
వరుడు కావలెను అంటోన్న రీతు వర్మ, నాగశౌర్య ఆమెకు సరితూగుతాడా..ఈ వీడియో చూసి చెప్పండి