కమాండర్ అభినందన్ మూవీ..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పేరు మోగిపోతోంది. ఈ ధీరుడి చరిత్రను తెరకెక్కించాలని బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. అభినందన్ భారత్ వచ్చిన రోజు నుంచి ఈ చిత్రాలకు సంబంధించిన టైటిళ్లను రిజిస్టర్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో టీ-సిరీస్, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా పుల్వామా దాడి నేపథ్యంలో వచ్చే సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్. కాగా.. అభినందన్ పాత్రలో ఎవరు నటించనున్నారనే […]

కమాండర్ అభినందన్ మూవీ..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:51 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పేరు మోగిపోతోంది. ఈ ధీరుడి చరిత్రను తెరకెక్కించాలని బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. అభినందన్ భారత్ వచ్చిన రోజు నుంచి ఈ చిత్రాలకు సంబంధించిన టైటిళ్లను రిజిస్టర్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో టీ-సిరీస్, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా పుల్వామా దాడి నేపథ్యంలో వచ్చే సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్.

కాగా.. అభినందన్ పాత్రలో ఎవరు నటించనున్నారనే సందేహాలు వెల్లువెత్తాయి. ఆన్ స్క్రీన్ మీద అభినందన్ పాత్ర చేయమని అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానన్నారు నటుడు జాన్ అబ్రహమ్.