AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudhakar: చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. ఇప్పుడు చూస్తుంటే గర్వంగా ఉంది..

తెలుగు హాస్యనటుడు సుధాకర్ గురించి ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ దశాబ్దాలపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కామెడీ టైమింగ్, నటనతో అలరించారు. అటు నటుడిగా, విలన్ పాత్రలతో మెప్పించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తన సుదీర్ఘ సినీ ప్రయాణం, అగ్ర నటులతో ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, అలాగే తన కుమారుడు బెన్నీ కుమార్ సినీరంగ ప్రవేశం గురించి సవివరంగా తెలియజేశారు.

Sudhakar: చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. ఇప్పుడు చూస్తుంటే గర్వంగా ఉంది..
Sudhakar
Rajitha Chanti
|

Updated on: Jun 10, 2026 | 9:49 PM

Share

ప్రముఖ తెలుగు హాస్యనటుడు సుధాకర్ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, అగ్ర నటులతో ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, అలాగే తన కుమారుడు బెన్నీ కుమార్ సినీరంగ ప్రవేశం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. సుధాకర్ తన కెరీర్‌లో కృష్ణ, చిరంజీవి, జగపతిబాబు, బాలకృష్ణ వంటి అగ్రతారల చిత్రాల్లో తప్పనిసరిగా భాగమయ్యేవాడినని గుర్తు చేసుకున్నారు. “సుధాకర్ ఉంటే కామెడీ బాగుంటుంది” అని తనను ప్రోత్సహించి, తమ సినిమాల్లో పెట్టుకునేవారని ఆయన తెలిపారు. కృష్ణ తర్వాత తనకు మంచి జ్ఞాపకశక్తి ఉందని అందరూ ఆర్టిస్టులు ప్రశంసించేవారని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి, బాలకృష్ణలతో తనకు మంచి స్నేహం ఉందని, ముఖ్యంగా బాలకృష్ణ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. నాగార్జున, వెంకటేష్ కూడా తనను ఎప్పుడూ పలకరించి, తన పట్ల ఆప్యాయత చూపేవారని సుధాకర్ వివరించారు. తాను ఎక్కువగా ఇష్టపడే డైలాగుల్లో “అబ్బా” అనే పదం ఉంటుందని, సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని శ్రీ వీరాంజనేయ పవన్ కుమార్ ఇంగ్లీష్ డైలాగ్ తనకు చాలా ఇష్టమని సుధాకర్ గుర్తు చేసుకున్నారు.

సుధాకర్ కుమారుడు బెన్నీ కుమార్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడైంది. తన కుమారుడి భవిష్యత్తు కోసం చిరంజీవి, బ్రహ్మానందం, జగపతిబాబులను కలిశానని సుధాకర్ తెలిపారు. ఈ ముగ్గురూ బెన్నీ ఫోటోలను చూసి, బాగా ప్రోత్సహించారని చెప్పారు. ముఖ్యంగా బ్రహ్మానందం బెన్నీకి అవకాశాలు ఇప్పించారని సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి బెన్నీని చూసి సంతోషపడ్డారని, తన సినిమాలో కూడా అవకాశం ఇస్తానని చెప్పారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, punctuality పాటించమని, తన తండ్రి సినిమాలు, తన సినిమాలు బాగా చూడమని చిరంజీవి బెన్నీకి సలహా ఇచ్చారని సుధాకర్ తెలిపారు. బెన్నీకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని, ఆయనకు పవన్ కళ్యాణ్ అభిమాని అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

చిన్నతనంలో రామ్ చరణ్‌తో తనకు పరిచయం ఉందని, చరణ్ తన మెడలోని లాకెట్ పట్టుకుని లాగేవాడని సుధాకర్ చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకున్నారు. చెన్నైలో చిత్ర పరిశ్రమ ఒక కుటుంబంలా ఉండేదని, గెట్-టుగెదర్‌లు, కలవడాలు ఎక్కువగా ఉండేవని, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఆ దూరం పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఒక నెల రోజుల పాటు కోమాలో ఉన్నప్పటికీ, దేవుడి దయ వల్ల కోలుకున్నానని, ప్రస్తుతం 65 ఏళ్ల వయస్సులో సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం బాలేనప్పుడు ఆర్థికంగా చాలా చితికారనే వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ, అదంతా వాస్తవం కాదని, తాను ఎప్పుడూ అంత తక్కువ స్థాయికి వెళ్లలేదని, ఆర్థికంగా హ్యాపీగానే ఉన్నానని సుధాకర్ స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us