AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Ramu: హోటల్‌లో వెయిటర్ చేశా.. జబర్దస్త్‌లో నాకు ఛాన్స్ ఇచ్చింది ఆయనే

జబర్దస్త్ నటుడు రాము ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ షోలోని తన అనుభవాలు, ఇతర నటీనటులు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. షోకు సంబంధించిన పలు కీలక అంశాలపై అతడు తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అలాగే తనకు జబర్దస్త్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిపాడు.

Jabardasth Ramu: హోటల్‌లో వెయిటర్ చేశా.. జబర్దస్త్‌లో నాకు ఛాన్స్ ఇచ్చింది ఆయనే
Ramu
Rajeev Rayala
|

Updated on: May 06, 2026 | 12:19 PM

Share

జబర్దస్త్ జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంతో మంది ఈ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను నవ్వించి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు కొందరు. కొంతమంది కమెడియన్స్ గా సెటిల్ అయితే సుధీర్ లాంటి వారు హీరోలుగా మారారు. అలాగే దర్శకులుగా మారిన వారు కూడా ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది కనిపించకుండా మాయం అయినా వారు కూడా ఉన్నారు. తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించి.. ఇప్పుడు పెద్దగా ఎక్కడ అకనిపించని వారిలో రాము ఒకరు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించాడు రామ్. కానీ ఆతర్వాత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు. అలాగే కొన్ని సినిమాల్లోనూ కనిపించి ఆకట్టుకున్నారు ఈ క్రేజీ కమెడియన్. కానీ ఇప్పుడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్నాడు రాము.

ఇది కూడా చదవండి : హిట్లర్ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారో తెలుసా.?

తాజాగా రాము ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే తన నిజాయితీని ప్రశ్నించినప్పుడు, రాము దీటుగా స్పందించారు. తాను ఎప్పుడూ నిజాలే చెబుతానని, ఎవరికీ భయపడి లేదా ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. తనకు తెలిసిన విషయాలను మాత్రమే చెబుతానని, తెలియనివి చెప్పలేనని  రాము చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి :ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా.. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ కామెంట్స్

అలాగే ఇంటర్వ్యూయర్ జబర్దస్త్ కామెడీ షోను ఎందుకు మానేశారు .? అని సూటిగా ప్రశ్నించగా, రాము దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా.. జబర్దస్త్ లో రాణించాలనుకున్నా.. అక్కడ సక్సెస్ అయ్యా.. అలాగే ఇప్పుడు టీవీల్లో ఆర్టిస్ట్ గా ప్రయత్నిస్తున్నా అని అన్నారు.  ప్రతి ఒక్కరికీ ఒక ఆశయం ఉండాలని తాను కోరుకుంటానని చెబుతూ .. జబర్దస్త్ కార్యక్రమం తమ అందరికీ నిజంగానే ఒక మంచి వేదిక అని ఆయన అన్నాడు. జబర్దస్త్ లో నాకు ఛాన్స్ ఇచ్చింది చమ్మక్ చంద్ర అన్న అని తెలిపాడు రాము. టీవీల్లో సినిమాల్లో రాణించాలనే.. ఇక్కడ నా టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం బయటకు వచ్చా అని తెలిపాడు రాము. అలాగే రామోజీ ఫిలిం సిటీలో హోటల్ ఇండస్ట్రీలో పని చేశాను.. వెయిటర్ గా జాయిన్ అయ్యి.. అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి ఎదిగాను అని తెలిపాడు రాము. అలాగే వెయిటర్ గా చేస్తున్న సమయంలో తనకు రూ. 850రూపాయిల జీతం వచ్చేది అని తెలిపాడు. నాతోపాటు సుడిగాలి సుధీర్ కూడా పని చేసేవాడు. సుధీర్ క్లోజప్ మ్యాజిక్ చేసేవాడు. హోటల్ కు వచ్చిన విజిటర్స్ కు మ్యాజిక్ చేసి చూపించేవాడు. ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది అని రాము తెలిపాడు.

ఇది కూడా చదవండి : Trisha: విజయ్ కాదు అతనే నా ఫేవరెట్ హీరో.. ఊహించని పేరు చెప్పిన త్రిష

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us