హిట్లర్ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారో తెలుసా.?
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో హిట్లర్ సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..

నటి మీనా కుమారి గుర్తున్నారా.? మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ సినిమాలో ఐదుగురు చెల్లెళ్లలో ఒకరిగా నటించి మెప్పించారు ఆమె.. తెలుగులో కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీనా కుమారి. ఆతర్వాత పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ప్రారంభించారు. దాంతో ఆమె సినిమాకు గుడ్ బై చెప్పేశారు. కాగా గతంలో ఆమె హిట్లర్ సినిమా గురించి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమా రీమేక్‌గా మలయాళం నుండి వచ్చిందని, చిరంజీవి పేరు వినగానే తాను వెంటనే ఒప్పుకున్నానని ఆమె తెలిపారు. ఐదుగురు చెల్లెళ్లను ఎడిటర్ మోహన్ చెన్నై నుండే ఎంపిక చేశారని, వారిలో అశ్విని, మోహిని, గాయత్రి, పద్మశ్రీ (రాజశ్రీ)తో పాటు తాను ఉన్నానని మీనా కుమారి వివరించారు. దాదాపు 55 రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్ తమ జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి ఆ సమయంలో సుమారు నాలుగు నుండి ఐదు నెలల పాటు సినిమాలకు విరామం తీసుకున్నారని, హిట్లర్ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనే తన నిర్ణయం పట్ల కొందరు భయపడ్డారని మీనా కుమారి గుర్తుచేసుకున్నారు. అయితే, ఆయన తమను ఏమాత్రం పెద్ద హీరోగా కాకుండా సొంత చెల్లెళ్లుగా చూసుకున్నారని, భయాన్ని పోగొట్టి స్వేచ్ఛగా నటించే వాతావరణాన్ని కల్పించారని ఆమె వివరించారు.
ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది
సెట్‌లో చిరంజీవి ఉదయాన్నే వచ్చి తిన్నావా.? అని అడగడం, జోకులు వేసుకుని నవ్వుకోవడం, అందరితో కలిసి భోజనం చేయడం వంటివి తమకు ఎంతో గొప్ప అనుభూతినిచ్చాయని మీనా కుమారి తెలిపారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కూడా సెట్‌లో నవ్వులు పూయించేవారని, దీంతో షూటింగ్ చాలా సరదాగా జరిగిపోయిందని ఆమె అన్నారు. ఒక షాట్‌లో తాను చిన్న తప్పు చేసినప్పుడు, దాన్ని చిరంజీవి స్వయంగా సరిదిద్ది, ఎలా చేయాలో చెప్పి చేయించారని, ఆయన చూపిన ఈ శ్రద్ధ తమను మరింత ప్రోత్సహించిందని మీనా కుమారి గుర్తుచేసుకున్నారు. తెలుగు తెలిసిన దానిలో తానే ఒక్కదానిని కాబట్టి, జోకులను బాగా అర్థం చేసుకుని, ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేదానినని అన్నారు.
ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్
షూటింగ్ పూర్తైన తర్వాత కూడా చిరంజీవి అన్నయ్యగానే చూసుకున్నారు, ఒక ఫంక్షన్‌కు ఒంగోలు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్‌లో తమకు రక్షణగా ఉండి చూసుకున్నారని మీనా కుమారి పేర్కొన్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ప్రివ్యూను కూడా హిట్లర్ షూటింగ్ జరుగుతున్నప్పుడే తాము చూశామని, చిరంజీవి గారే తమను ఆ ప్రివ్యూకు తీసుకెళ్లారని ఆమె అన్నారు. సినిమా పూర్తయ్యాక కొంతకాలం వరకు తమ అక్కచెల్లెళ్ల అనుబంధం కొనసాగిందని, కానీ ఎవరి వృత్తిలో వారు బిజీ అయిపోయి, దూరం పెరిగిందని ఆమె వివరించారు. ప్రస్తుతం అశ్విని సింగపూర్‌లో ఉందని, గాయత్రి సీరియల్స్ చేస్తున్నారని, మోహిని, పద్మశ్రీ (రాజశ్రీ)ల ఆచూకీ తెలియదని లేదా టచ్‌లో లేరని ఆమె చెప్పారు. ప్రస్తుతం చిరంజీవితో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, అవార్డ్స్ వంటి వేడుకల్లో కలిసినప్పుడు ఆయన తనను పేరుపెట్టి పలకరించి, క్షేమ సమాచారాలు అడగడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని మీనా కుమారి అన్నారు. మెగాస్టార్‌ను ఇప్పటికీ తాను అన్నయ్యగానే భావిస్తానని, మళ్ళీ ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని మీనా కుమారి తెలిపారు.
ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
