ఇన్ స్టాలో కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్.. ఆమెను మించిన తోపు లేరు..

Rajitha Chanti

Pic credit - Instagram

22  July 2026

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన నటన, గ్లామర్ , బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

‘ఆషికీ 2’, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన చేసిన ‘సాహో’, అలాగే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘స్త్రీ’, ‘స్త్రీ 2’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో క్రేజ్ సంపాదించకుంది. 

నటనతో పాటు తెలివైన పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో శ్రద్ధా భారీగా ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్ స్టా లెక్కలు చూసి ఆశ్చర్యపోతున్నారు.

తాజా నివేదికల ప్రకారం శ్రద్ధా కపూర్ మొత్తం ఆస్తి సుమారు రూ.130 కోట్లు. ఆమె ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల నుండి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు.

 ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి ఒక్కో ఒప్పందానికి సుమారు రూ.1.6 కోట్లు ఛార్జ్ చేస్తారు. బిజినెస్ రంగాన్లోకి కూడా అడుగుపెట్టింది శ్రద్దా కపూర్.

శ్రద్ధా కపూర్ ముంబైలోని అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలో ప్రశాంతమైన సీ-ఫేసింగ్  అపార్ట్‌మెంట్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నారు.

ఆమె ఆస్తి విలువ సుమారు రూ.60 కోట్లు ఉంటుందని అంచనా. అంతేకాకుండా మడ్ ఐలాండ్‌లో రూ.20 కోట్ల విలువైన విల్లా కూడా ఆమెకు ఉంది.

ఆమె గ్యారేజీలో లంబోర్గిని హురకాన్, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz GLE) వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.