Ullasamga Utsahamga Movie : ఒక్క సినిమాతో సెన్సేషన్.. స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్.. ఎలా చనిపోయారో తెలుసా..
నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కొందరు సక్సెస్ కోసం ఎదురుచూస్తే.. మరికొందరు మాత్రం ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అవుతుంటారు. రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోతుంది. ఫస్ట్ మూవీతోనే హిట్టుకొట్టి ఆ తర్వాత స్టార్ డమ్ సంపాదించుకోవాల్సిన ఈ హీరో ఎలా చనిపోయారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే ఫేమస్ అయ్యారు. అలాగే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఊహించని స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో గురించి మీకు చెప్పక్కర్లేదు. యశో సాగర్.. ఈపేరు అందరికి తెలియకపోవచ్చు. కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ హీరో అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతో అంతగా పాపులర్ అయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయం. అలాగే నటనపరంగా విమర్శకుల ప్రశంసలు. ఇంకేముంది రాత్రికి రాత్రే స్టార్ డమ్. హీరోగా క్యూ కట్టిన ఆఫర్స్. తక్కువ సమయంలోనే వెండితెరపై ఓ వెలుగు వెలగాల్సిన ఈ హీరో జీవితం ఒక్క రాత్రి జరిగిన సంఘటనతోనే మలుపులు తిరిగింది. మూప్పై ఏళ్లు కూడా నిండకుండానే తిరిగిరాని లోకాలకు వెళఅలిపోయారు. చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..
యశో సాగర్.. కన్నడ ప్రొడ్యూసర్ బీపీ సోము కొడుకు. కన్నడలో సూపర్ హిట్ అయిన ప్రేమ సంఘమ, హృదయ హాడితు వంటి చిత్రాలను నిర్మించారు. ఇక తెలుగులో తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాను నిర్మించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు మంచి వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ సినిమా అయినప్పటికీ తనదైన నటనతో అలరించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు యశో సాగర్. డైరెక్టర్ ఏ. కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ కథానాయికగా న టించింది. 2008 జూలైలో ఈ మూవీ విడుదల కాగా.. మొదటి రోజే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 4 కోట్లతో నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ.16 కోట్లు రాబట్టింది.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
ఆ తర్వాత Mr.ప్రేమికుడు సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా విడుదలకు ముందే చనిపోయాడు యశో సాగర్. 2012 డిసెంబర్ 19న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యశో సాగర్ చనిపోయారు. తన స్నేహితుడు విశ్వనాథ్ రెడ్డి, లోకేష్ లతో కలిసి పూణేకు కాస్ట్యూమ్స్ కోసం వెళ్లిన యశో సాగర్ తిరిగి రిటర్న్ అయ్యారు. కర్ణాటకలోని తుముకూరు దగ్గర తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యశో సాగర్ అక్కడికక్కడే చనిపోయారు. హీరో మరణవార్త విని యావత్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ ఈ హీరో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్తాయిగా నిలిచిపోయాడు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..
ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..
