AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ప్లాప్ అవుతుందని అందరూ అన్నారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన చిరంజీవి సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మార్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. మొదట రెబల్ స్టార్ హీరో కృష్ణం రాజుతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ చిత్రంలోకి చిరంజీవి వచ్చారు. అయితే సినిమా స్టోరీ విన్నాక అందరూ ప్లాప్ అవుతుందని అన్నారు. కానీ ఊహించని విధంగా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న మూవీ ఏంటో తెలుసా.. ?

Tollywood : ప్లాప్ అవుతుందని అందరూ అన్నారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన చిరంజీవి సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2026 | 11:24 AM

Share

మెగాస్టార్ చిరంజీవి… దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అందులో చిరు కెరీర్ మార్చి నెం.1 హీరోగా నిలబెట్టిన సినిమా పసివాడి ప్రాణం. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. తెలుగులో బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసిన ఏకైక హీరో. అయితే ఈ సినిమాకు ముందుగా చిరును అనుకోలేదట. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు రెబల్ స్టార్ కృష్ణం రాజుతో చేయాలని భావించారట మేకర్స్. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో తెలుగులో అనేక సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించారు జీవీ నారాయణ రావు. మలయాళంలో ఫాజిల్ దర్శకత్వం వహించిన ఒక చిత్రాన్ని చూసి, దాని రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఈ కథను చిరంజీవికి చెప్పినప్పుడు, అందులో పాటలు, ఫైట్లు లేకపోవడంతో “ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు?” అని ఆయన సందేహించారని నారాయణరావు గుర్తుచేసుకున్నారు. “పిల్లల మనసులో నీకు మంచి స్థానం ఉంది, పిల్లల కోసం నువ్వు చేసే త్యాగం ఈ సినిమాకు హైలైట్ అవుతుంది” అని చెప్పి చిరంజీవిని ఒప్పించానని నారాయణరావు తెలిపారు. అయితే, ఈ లోపు నారాయణరావు భాగస్వామి హరిప్రసాద్ తమిళ వెర్షన్ డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసి, కృష్ణంరాజుతో “పసివాడి ప్రాణం” చిత్రీకరణను కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ప్రారంభించారు. తాను లక్ష రూపాయలు చెల్లించి స్ట్రెయిట్ రీమేక్ హక్కులను కొన్నప్పటికీ, డబ్బింగ్ హక్కులున్నవారు నేరుగా సినిమా తీయడం అన్యాయమని నారాయణరావు వాదించారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

పరిస్థితిని చక్కదిద్దడానికి నారాయణరావు అల్లు అరవింద్‌ను ఆశ్రయించారు. చిరంజీవి కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదని అల్లు అరవింద్ మొదట వదిలేద్దామన్నా, నారాయణరావు పట్టుబట్టారు. “ఈ సినిమాను చిరంజీవితోనే తీయాలి, లేకపోతే కుదరదు” అని నారాయణరావు చెప్పడంతో, అల్లు అరవింద్ చిరంజీవిని ఒప్పించారు. అంతకుముందు, నారాయణరావు వ్యూహాత్మకంగా బాలనటి సుజితను (కేరళ నుండి) అలాగే నటులు రఘువరన్, ఆంటోనిలను ముందుగా బ్లాక్ చేశారు. “ఈ ముగ్గురు లేకపోతే సినిమాకు సరైన ఎమోషన్ ఉండదు” అని చిరంజీవికి వివరించి, తన వైపు బలాన్ని పెంచుకున్నారు. చివరికి, చిరంజీవి కోదండరామిరెడ్డికి ఫోన్ చేయడంతో, కృష్ణంరాజు ప్రాజెక్ట్ ఆగిపోయి, చిరంజీవితో “పసివాడి ప్రాణం” పట్టాలెక్కింది.

ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

ఈ సినిమా విజయానికి మూలకారణాలను వివరిస్తూ, ఒరిజినల్‌లో లేని సుమలత పాత్రను జోడించడం, సత్యానంద్, నారాయణరావు కలిసి స్క్రీన్‌ప్లేను మెరుగుపరచడం, ఆరు పాటలు, ఫైట్‌లు జోడించి వాణిజ్యపరంగా మలచడం వంటి అంశాలను నారాయణరావు ప్రస్తావించారు. విజయశాంతి, సుమలత వంటి హీరోయిన్‌లు, గ్లామర్‌ను జోడిస్తూనే, కథా నేపథ్యాన్ని చెడగొట్టకుండా జాగ్రత్తపడటంతో సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. తాను దాదాపు 12 గంటలు చిరంజీవితో కలిసి పనిచేసేవాడినని, జిమ్‌కు వెళ్ళేటప్పుడు కూడా ఆయనే తనను తీసుకువెళ్ళేవారని నారాయణరావు పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..

Follow Us