Ramayana Telugu Trailer: ఇకపై ముల్లోకాల్లోనూ రావణ రాజ్యమే.. ‘రామాయణ’ తెలుగు ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్నమూవీ రామాయణ. చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. అలాగే కన్నడ స్టార్ యశ్ రావణుడిగా దర్శనమివ్వనున్నాడు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా తెరకెక్కిన మూవీ రామాయణ. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన నితీశ్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ హీరో యశ్ ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రామాయణ నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామయాణం సినిమా హిందీ ట్రైలర్ యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. రామాయణ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రామాయణ కథ అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్‌లో విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ అదిరిపోయింది. అలాగే సీతగా సాయి పల్లవి చాలా అందంగా కనిపించింది. ఇక దేవలోకం.. భూలోకం.. పాతాళ లోకం.. ఇకపై ముల్లోకాల్లోనూ ఒకటే సామ్రాజ్యం.. రావణ రాజ్యం’ అంటూ యశ్ నుంచి వచ్చిన డైలాగులు హైలెట్ గా నిలిచాయి.
రామాయణ సినిమా విషయానికి వస్తే.. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, ‘డీఎన్ఈజీ’, హీరో యశ్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, రవి దూబే తదితర స్టార్స్ వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఐకానిక్ మూవీకి ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ ‘DNEG’ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తుండగా ప్రీమియం ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. త్వరలోనే రామాయణ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
రామాయణ తెలుగు ట్రైలర్ ఇదిగో..
‘జయ జయ రామ్’ సాంగ్ తెలుగు వెర్షన్ లిరికల్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




