AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా.. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ కామెంట్స్

సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆర్జీవీ.. ఇప్పుడు అంతగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేసినా అది ఓ పెద్ద వార్తే అవుతుంది.

ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా.. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Rgv
Rajeev Rayala
|

Updated on: May 05, 2026 | 11:42 AM

Share

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతోనే కాదు వివాదాలతోనూ ఎక్కువగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన రామ్ గోపాల్ వర్మ.. ఆతర్వాత అలాంటి సినిమాలు తెరకెక్కించలేదు.. ఆయన నుంచి ఓ సాలిడ్ సినిమా కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. శివ లాంటి సినిమాను వర్మ నుంచి కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే గతంలో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఓ గేయ రచయిత గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై తనదైన శైలిలో స్పందించారు, ఇది అనేకమందిని ఆశ్చర్యపరిచింది.

ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

సాధారణంగా ఏడవటం, బాధపడటం వంటివి చేయని వర్మ, సీతారామశాస్త్రి మరణంపై మాత్రం తన ఆవేదనను, ఆరాధనను వెల్లడించారు. విషాదాన్ని తట్టుకోవడానికి హాస్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మరణాన్ని ఒక మైండ్‌సెట్‌గా చూస్తూ, స్వర్గానికి వెళ్లడం అనేది దుబాయ్ లేదా అమెరికాకు వెళ్లినట్లే అని అన్నారు వర్మ. ఒక వ్యక్తి అమరత్వం అనేది వారు జీవించిన విధానం, సమాజానికి వారు అందించిన సేవపై ఆధారపడి ఉంటుందని వర్మ నమ్ముతారు. సీతారామశాస్త్రి తన అద్భుతమైన సాహిత్యంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను తాకారని, ఆయన లేకపోయినా ఆయన సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ జీవించి ఉంటుందని వర్మ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్

గత  కొన్నేళ్లుగా సిరివెన్నెలతో తనకు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు లేకపోయినప్పటికీ, తన ఆరాధనను మాత్రం నిస్సందేహంగా వ్యక్తపరిచారు. తాను వ్యక్తిగత బంధాలను అంతగా పట్టించుకోని స్వభావం కలవాడిని కాబట్టే ఈ దూరం ఏర్పడిందని వర్మ వివరించారు. రామ్ గోపాల్ వర్మ, సీతారామశాస్త్రి.. వీరిద్దరూ సమాజంలో మార్పును ఆశించి “కోపంగా” ఉండేవారని వర్మ తెలిపారు. అయితే, తాను ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి, దానిని మార్చడానికి ప్రయత్నించడం కంటే ఆస్వాదించడానికి ఇష్టపడతానని వర్మ వివరించారు. సీతారామశాస్త్రి చివరి క్షణం వరకు “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని” వంటి తన పాటల ద్వారా తన సామాజిక ఆవేదనను వ్యక్తపరుస్తూనే ఉన్నారని వర్మ అన్నారు. ఈ పాటలు సినిమా సన్నివేశాల కోసం కాకుండా, ఆయన మనసులోని భావాలను ప్రతిబింబిస్తాయని, వాటిని తానూ సినిమాల్లో ఉపయోగించుకున్నానని వర్మ వెల్లడించారు.

ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా..
ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా..
రోజూ పల్లీలు తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
రోజూ పల్లీలు తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
లక్ష్మీ కటాక్షం కోసం ఈ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ 3 తప్పులు ..
లక్ష్మీ కటాక్షం కోసం ఈ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ 3 తప్పులు ..
మీ మందార మొక్కకు పూలు పూయడం లేదా? ఈ సీక్రెట్ తో పూల వర్షమే!
మీ మందార మొక్కకు పూలు పూయడం లేదా? ఈ సీక్రెట్ తో పూల వర్షమే!
నిర్మల్ జిల్లా రైతుల కోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలుసా?వీడియో
నిర్మల్ జిల్లా రైతుల కోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలుసా?వీడియో
ముంబై టీమ్‎కి నేనే దిక్కు.. వీడి కాన్ఫడెన్స్ మామూలుగా లేదు
ముంబై టీమ్‎కి నేనే దిక్కు.. వీడి కాన్ఫడెన్స్ మామూలుగా లేదు
వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్
వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్
హాస్టల్లో ఇదేం పని.. చదువుకోవడానికి వెళ్లి ఏం చేస్తున్నారు..?
హాస్టల్లో ఇదేం పని.. చదువుకోవడానికి వెళ్లి ఏం చేస్తున్నారు..?
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ పని చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ పని చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు
మామిడిపండ్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త!ఈ విషయాలు గుర్తుంచుకోండి
మామిడిపండ్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త!ఈ విషయాలు గుర్తుంచుకోండి