AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను.. స్టార్ యాంకర్ ఇలా అనేసిందేంటి?

పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఒకటి కాదు రెండు సార్లు బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో మంచి కంటెస్టెంట్ గానే పేరు తెచ్చుకుంది.

Bigg Boss Telugu: అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను.. స్టార్ యాంకర్ ఇలా అనేసిందేంటి?
Bigg Boss Telugu
Basha Shek
|

Updated on: May 06, 2026 | 10:55 AM

Share

బుల్లితెరపై అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ తెలుగు అని చెప్పవచ్చు. ఈ షో గురించి ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా దీని క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు. సీజన్ సీజన్ కు ఈ రియాలిటీ షోకు ఆదరణ మరింత పెరుగుతోంది. కొత్త కంటెస్టెంట్స్, కొత్త టాస్కులతో బుల్లితెర ఆడియెన్స్ కు బోలెడు ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది. అయితే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన కొందరు ఈ రియాలిటీ షోపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు. అలా స్టార్ యాకంర్ ఓ ఇంటర్వ్యూలో ఈ రియాలిటీ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించిన ఈ అందాల తార రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న హరితేజ గతేడాది బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. అయితే ఈ హౌస్ లో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జన్మలో ఇంకోసారి బిగ్ బాస్ కు వెళ్లనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది హరితేజ

‘బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్ లో జరగలేదు. ముంబై సమీపంలో ఉన్న లోనావాలాలో జరిగింది. అడవిలో బిగ్ బాస్ సెట్ వేశారు. రాత్రి అయితే పులుల శబ్దాలు వినిపించేవి. హౌస్ లోకి పాములు కూడా వచ్చేవి. కానీ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. . ఆ అనుభవాలు భయంకరంగా ఉన్నా, అదే సమయంలో థ్రిల్లింగ్‌గా అనిపించాయి. ఆ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సరదా సంభాషణలు కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నా అభిప్రాయం మారింది. నా ఇమేజ్ చాలా దెబ్బతింది. బయట చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటి వల్ల నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు బిగ్ బాస్‌పై ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది… కొన్నిసార్లు చిరాగ్గా కూడా అనిపిస్తుంది. అందుకే ఇక మళ్లీ బిగ్ బాస్‌కు వెళ్లాలనే ఆలోచనే లేదు’ అని చెప్పుకొచ్చింది హరి తేజ.

ఇవి కూడా చదవండి

హరితేజ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్