AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: విజయ్ కాదు అతనే నా ఫేవరెట్ హీరో.. ఊహించని పేరు చెప్పిన త్రిష

తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ త్రిష పేరు మారుమ్రోగింది. నిన్న ( మే 4న )సామాన్య భక్తురాలిలా సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష, శ్రీవారి ఆశీస్సులు పొందిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా చెన్నైకి పయనమయ్యారు. తిరుమల నుండి నేరుగా విజయ్ నివాసానికి చేరుకున్న ఆమె అక్కడ జరుగుతున్న సంబరాల్లో పాలుపంచుకున్నారు.

Trisha: విజయ్ కాదు అతనే నా ఫేవరెట్ హీరో.. ఊహించని పేరు చెప్పిన త్రిష
Trisha Krishnan
Rajeev Rayala
|

Updated on: May 05, 2026 | 1:13 PM

Share

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్రిష ఎక్కడ ప్రచారం చేయలేదు.. డైరెక్ట్‌గా ఎవరికి మద్దతు ప్రకటించలేదు.. అయినప్పటికి త్రిష విజయ్ పార్టీ విజయంలో ప్రధాన పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు త్రిష 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు.. తమిళనాడు ఫలితాల ముందు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు త్రిష. తిరుమల దర్శనం చేసుకున్న తరువాత త్రిష నేరుగా విజయ్‌ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష-విజయ్‌ రిలేషన్‌ చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ అధికారంలోకి వస్తే త్రిష పవర్‌ సెంటర్‌ అవుతారని ప్రచారం సైతం జరిగింది. అయితే.. అనూహ్యంగా విజయ్ గెలుపు.. త్రిష పుట్టినరోజు ఒకే నాడు రావడం పట్ల విజయ్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి..

ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

సోషల్ మీడియాలో సైతం విజయ్, త్రిష హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఊహించని విధంగా విజయ్ పాగా వేయడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్‌-త్రిషను టార్గెట్‌ చేస్తూ ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. విజయ్‌ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ డీఎంకే , బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అయితే ఎన్నికల ఫలితాల రోజు విజయ్‌ ఇంటికి వచ్చి త్రిష అభినందనలు తెలపడం సంచలనం రేపింది. విజయ్‌ ఇంటికి త్రిష రావడంపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్

ఇదిలా ఉంటే త్రిష తన అభిమాన హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. తన అభిమాన హీరో అజిత్ అని తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అజిత్ ఫోటో చూపించి ఆయన గురించి చెప్పమనగానే అతను నా అభిమాన హీరో.. అంటూ త్రిష చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దళపతి విజయ్ ఫోటో చూపించగా.. మంచి నటుడు, చార్మింగ్ పర్సన్ అంటూ తెలిపారు. ఆతర్వాత విజయ్ సేతుపతి ఫోటో చూపించగానే ఆయన కూడా తన అభిమాన నటుడు అని తెలిపారు త్రిష. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us