Brahmanandam: రాష్ట్రపతిని కలిసిన హాస్యబ్రహ్మా.. ఆంజనేయ స్వామి చిత్రాన్ని బహుమతి ఇచ్చిన బ్రహ్మానందం..
టాలీవుడ్ హాస్యబ్రహ్మా బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆదివారం హైదరాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గ్లోబల్ కమెడియన్ బ్రహ్మానందం కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం తాను లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని అందచేశారు.

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం తేనీటి విందు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ ప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే టాలీవుడ్ హాస్యబ్రహ్మా బ్రహ్మానందం సైతం రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గ్లోబల్ కమెడియన్ బ్రహ్మానందం కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం తాను లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని అందచేశారు.
ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..




