AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teaser Talk: ఇందులో కనిపించేవన్నీ మన కథలే.. సిల్వర్‌ స్క్రీన్‌పై మరో ఆసక్తికర సినిమా. పంచతంత్రం టీజర్ చూశారా.?

Teaser Talk: సమాజంలో జగిరే సంఘటనల ఆధారంగా ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే బయోపిక్‌ల మాట అటు ఉంచితే.. సామాన్యుల ఇతి వృత్తాలను ఆధారంగా చేసుకొని కొన్ని సినిమాలు వచ్చాయి. వీటిలో..

Teaser Talk: ఇందులో కనిపించేవన్నీ మన కథలే.. సిల్వర్‌ స్క్రీన్‌పై మరో ఆసక్తికర సినిమా. పంచతంత్రం టీజర్ చూశారా.?
Panchatantram
Narender Vaitla
|

Updated on: Oct 13, 2021 | 3:49 PM

Share

Teaser Talk: సమాజంలో జగిరే సంఘటనల ఆధారంగా ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే బయోపిక్‌ల మాట అటు ఉంచితే.. సామాన్యుల ఇతి వృత్తాలను ఆధారంగా చేసుకొని కొన్ని సినిమాలు వచ్చాయి. వీటిలో కేరాఫ్‌ కంచెర పాలెం, చందమామ కథలు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే తాజాగా వస్తోన్న మరో సినిమా ఇదే జాబితాలోకి చేరాల కనిపిస్తోంది. హార్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. ఐదురుగు వ్యక్తుల జీవితాల్లో జరిగిన కథల సమాహారమే ఈ చిత్రం. ఈ సినిమాలో బ్రహ్మానందం, కలర్స్‌ స్వాతి, శివాత్మిక రాజశేఖర్‌, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. 1.36 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్ర టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సత్యదేవ్‌ చెప్పే.. ‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు’ అంటూ చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ తర్వాత ఐదు పాత్రలను పరిచయం చేసింది.

ఇక.. ‘అన్ని మన కథలే.. నిన్ను కన్న వాళ్లతో నీకు, నీ లైఫ్‌ పాట్నర్‌తో నీకు, నువ్వు కన్న వాళ్లతో నీకు, ఈ ప్రపంచంతో నీకు, నీతో నీకు ఉండే కథలు’ అంటూ సాగే సంభాషణ సినిమాపై అంచనాలు పెంచేశాయి. టీజర్‌ను గమనిస్తే మరో ఫీల్‌గుడ్‌ మూవీ వస్తున్నట్లు అనిపించకమానదు. మరి ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Strange Radio Waves: ఖగోళ పరిశోధనల్లో కీలక పరిణామం.. కీలక సంకేతాలు గుర్తింపు.. గ్రహాంతర వాసుల పనేనా?..

Health Tips: అల్లంతో ఆ స‌మ‌స్యకి చక్కటి ప‌రిష్కారం.. ఏంటో తెలుసుకోండి..

Police Arms Pooja Photos: పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఆయుధాల పూజ… కమిషనర్ మహేష్ భగవత్ ఐపియస్ ఫోటోస్..