‘అఘోరా’ పాత్రలో బాలయ్య.. అసలు విషయం చెప్పేసిన బోయపాటి..!

బోయపాటి- బాలకృష్ణ.. ఈ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ కాంబోలో ఇదివరకు రెండు చిత్రాలు రాగా.. అవి మంచి విజయాన్ని సాధించాయి.

'అఘోరా' పాత్రలో బాలయ్య.. అసలు విషయం చెప్పేసిన బోయపాటి..!
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 3:22 PM

బోయపాటి- బాలకృష్ణ.. ఈ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ కాంబోలో ఇదివరకు రెండు చిత్రాలు రాగా.. అవి మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. దీంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఆ మధ్యన కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఇందులో బాలయ్య ద్విపాత్రిభినయంలో నటించబోతున్నారని.. అందులో ఒకటి అఘోరా అని వార్తలు వినిపించాయి. ఇక అఘోరా పాత్ర కోసం బాలయ్య గుండు కొట్టించుకోవడంతో పాటు 15 కేజీల బరువు తగ్గినట్లు టాలీవుడ్‌లో టాక్ నడిచింది. ఈ పుకార్లన్నింటిపై తాజాగా దర్శకుడు బోయపాటి స్పందించారు.

ఇందులో బాలయ్య అఘోరా పాత్రలో నటించబోతున్నారని ఆయన స్పష్టతను ఇచ్చారు. అంతేకాదు కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరులుగా ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారని బోయపాటి చెప్పారు. ఈ మూవీలో ఇప్పటివరకు బాలయ్య ఎప్పుడూ కనిపించని పాత్రలో నటించబోతున్నారు. ఇందులో బాలయ్య లుక్ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాదు చాలా సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటిని నేను ఇప్పుడు రివీల్ చేయను. సినిమా చూసిన తరువాత మీకే తెలుస్తుంది అని బోయపాటి చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే ఈ కాంబోలో హ్యాట్రిక్‌ ఖాయమన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక మిర్యాలగూడ రవీంద్రరెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్‌గా కొత్త భామను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు.

Read This Story Also:  ప్రపంచ రికార్డ్‌ క్రియేట్ చేసిన ‘రామాయణ్’..!

అత్తారింట్లో వంటపని మొదలెట్టిన రకుల్.! వీడియో వైరల్.
అత్తారింట్లో వంటపని మొదలెట్టిన రకుల్.! వీడియో వైరల్.
చదువుల తల్లి సరస్వతిపై నోరు పారేసుకున్న ఉపాధ్యాయురాలు.!
చదువుల తల్లి సరస్వతిపై నోరు పారేసుకున్న ఉపాధ్యాయురాలు.!
ఈ-బైక్‌ బ్యాటరీ పేలి మంటలు.! న్యూయార్క్‌లో భారతీయుడు మృతి.
ఈ-బైక్‌ బ్యాటరీ పేలి మంటలు.! న్యూయార్క్‌లో భారతీయుడు మృతి.
ద్వారకలో అద్భుతం.. తీగల వంతెన ప్రారంభం..! ఇదిగో వీడియో.
ద్వారకలో అద్భుతం.. తీగల వంతెన ప్రారంభం..! ఇదిగో వీడియో.
కొవిడ్ టీకాలతో ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ..?
కొవిడ్ టీకాలతో ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ..?
చంద్రునిపై పక్కకు ఒరిగిన అమెరికా ప్రైవేటు ల్యాండర్‌.! వీడియో
చంద్రునిపై పక్కకు ఒరిగిన అమెరికా ప్రైవేటు ల్యాండర్‌.! వీడియో
మీకు ఫోన్‌ చేసింది ఎవరో తెలుసుకోవాలంటే ఇక ట్రూ కాలర్‌తో పనిలేదు.!
మీకు ఫోన్‌ చేసింది ఎవరో తెలుసుకోవాలంటే ఇక ట్రూ కాలర్‌తో పనిలేదు.!
ఇడ్లీతో తీరని ముప్పు.. వారికి షాక్.! వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ఇడ్లీతో తీరని ముప్పు.. వారికి షాక్.! వెలుగులోకి షాకింగ్ విషయాలు..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక