Book My Show: కరోనా ఎఫెక్ట్.. 200 మంది ఉద్యోగులను తొలగించిన బుక్ మై షో.. సీఈవో భావోద్వేగ ట్వీట్..
Book My Show: కరోనా మహమ్మారి వలన ఎంతో మంది జీవితాలు రోడ్డు పైకి చేరాయి. కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బకోట్టింది. దీంతో ఎన్నో కంపెనీలు మూతపడగా..
Book My Show: కరోనా మహమ్మారి వలన ఎంతో మంది జీవితాలు రోడ్డు పైకి చేరాయి. కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బకోట్టింది. దీంతో ఎన్నో కంపెనీలు మూతపడగా.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీ పై ఎక్కువగానే పడింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడగా.. షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతేడాది ప్రారంభమైన ఈ వైరస్ ప్రభావం ఆయా రంగాలను ఆర్థికంగా కోలుకోనివ్వడం లేదు. తాజాగా ఈ వైరస్ ప్రభావం.. ప్రముఖ ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షో సంస్థ పై పడింది.
కరోనా కారణంగా ఆ సంస్థ దాదాపు 200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత మే నెలలో ప్రపంచవ్యాప్తంగా 270 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. అంటే ఆ కంపెనీలో 18.6% శాతం ఉద్యోగులు ఉన్నారు. ఈ విషయాన్ని బుక్ మై షో సీఈవో ఆశీష్ హేమరాజని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఎంతో మంది ప్రతిభావంతుల్ని తొలగించాల్సి వస్తుంది. కరోనా ఎన్నో పాఠాలను నేర్పింది. తొలగించిన ఉద్యోగులు మాకు సహాయం చేయాలని కోరారు. కొత్త ఉద్యోగాలు పొందడానికి బాధిత సిబ్బందికి సహకరిస్తాం. అందుబాటులో ఉన్న ఏవైనా ఉద్యోగ అవకాశాలపై సమాచారం తీసుకొని సాయం చేస్తాం… అంటూ ట్వీట్ చేశారు. కొత్త ఉద్యోగం కొత్త చోటు ప్రయాణం ప్రారంభించాలనుకునేవారికి ఉద్యోగ సమాచారం తెలియజేయండి అని తెలిపారు. తిరిగి కోవిడ్ క్రైసిస్ నుంచి కోలుకుని అంతా బలంగా తిరిగి వస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. 2007లో ఇండియాలో ప్రారంభించిన ఈ ఆన్ లైన్ టికెటింగ్ సంస్థ అతి తక్కువ కాలంలో టాప్ స్థాయికి ఎదిగింది. కరోనా కారణంగా.. థియేటర్లు మూతపడడం, షూటింగ్స్ నిలిచిపోవడం వలన బుక్ మై షో సంస్థ పై ఎక్కువగానే ప్రభావం చూపించింది.
ట్వీట్..
COVID19 has taught me many lessons & I learnt another one today. As we let go of 200 of the most incredibility talented & performance driven individuals, each & everyone has messaged, thanking me for the opportunity, the love for @bookmyshow and asking me if they could help (1/4)
— ashish hemrajani (@fafsters) June 10, 2021
Also Read: Sonusood: తెలంగాణ యువకుడి సాహసం.. సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర.. చలించిపోయిన రియల్ హీరో…