శ్రీదేవిది హత్యా..!! కేరళ డీజీపీపై బొనికపూర్ ఫైర్

గతేడాది ఫిబ్రవరి 24.. అభిమానులకు గుండెకోత మిగిల్చి దివికెగారు అతిలొక సుందరి శ్రీదేవి. ఆమె లేరనే వార్త తెలిసి అభిమానులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. దుబాయ్‌లో తన కుటుంబానికి చెందిన ఓ ఫంక్షన్‌కెళ్లి చనిపోయారు. బాత్ టబ్‌లో పడిపోయి మృతిచెందారని యూఏఈ అధికారులు కూడా ధ్రువీకరించారు. తాజాగా శ్రీదేవీది సహజ మరణం కాదని కేరళ డీజీపీ ఆరోపణలు చేశారు. అయితే ఆ పోలీస్ అధికారి చేసిన ఆరోపణలను శ్రీదేవి భర్త బోనికపూర్ తోసిపుచ్చారు. సత్యదూరమైన అంశాలను ప్రస్తావించే […]

శ్రీదేవిది హత్యా..!!  కేరళ డీజీపీపై బొనికపూర్ ఫైర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:41 PM

గతేడాది ఫిబ్రవరి 24.. అభిమానులకు గుండెకోత మిగిల్చి దివికెగారు అతిలొక సుందరి శ్రీదేవి. ఆమె లేరనే వార్త తెలిసి అభిమానులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. దుబాయ్‌లో తన కుటుంబానికి చెందిన ఓ ఫంక్షన్‌కెళ్లి చనిపోయారు. బాత్ టబ్‌లో పడిపోయి మృతిచెందారని యూఏఈ అధికారులు కూడా ధ్రువీకరించారు.

తాజాగా శ్రీదేవీది సహజ మరణం కాదని కేరళ డీజీపీ ఆరోపణలు చేశారు. అయితే ఆ పోలీస్ అధికారి చేసిన ఆరోపణలను శ్రీదేవి భర్త బోనికపూర్ తోసిపుచ్చారు. సత్యదూరమైన అంశాలను ప్రస్తావించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఊహలలోకంలో విహరిస్తూ .. కట్టుకథలు అల్లితే విశ్వాసం ఉంటుందా అని ప్రశ్నించారు. ఆయనే కాదు తన స్నేహితుడి ప్రస్తావిస్తూ కాలమ్‌లో కట్టుకథ అల్లడం సరికాదన్నారు. ఇలాంటి పిచ్చిపనులపై తాను స్పందించబోనని స్పష్టంచేశారు బోనికపూర్.

శ్రీదేవిది సహజ మరణం కాదని కేరళ పత్రిక కేరళ కౌముదిలో కేరళ జైళ్ల శాఖ డీజీ రిషిరాజ్ సింగ్ ఓ ఆర్టికల్ రాశారు. దీంతో ఈ కథనంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతుంది. ఈ క్రమంలో బోనికపూర్‌ను వివరణ అడుగగా ఆయన ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఊహల లోకంలో విహరిస్తూ రాసే కట్టు కథలపై స్పందించబోనన్నారు. ఇలా కథనాలను రాస్తూ.. ఒకరి మృతి గురించి అసత్యాలను ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు.