AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రాజ్‌దూత్’ మూవీ రివ్యూ!

టైటిల్ : ‘రాజ్‌దూత్’ తారాగణం : మేఘాన్ష్, సుదర్శన్, నక్షత్ర , ఆదిత్య తదితరులు సంగీతం : వరుణ్ సునీల్ నిర్మాత : ఎం. ఎల్. వీ సత్యనారాయణ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అర్జున్, కార్తీక్ విడుదల తేదీ: 12-07-2019 స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంష్‌ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’. ప్రముఖ నిర్మాత ఎం. ఎల్. వీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]

'రాజ్‌దూత్' మూవీ రివ్యూ!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jul 15, 2019 | 9:51 PM

Share

టైటిల్ : ‘రాజ్‌దూత్’

తారాగణం : మేఘాన్ష్, సుదర్శన్, నక్షత్ర , ఆదిత్య తదితరులు

సంగీతం : వరుణ్ సునీల్

నిర్మాత : ఎం. ఎల్. వీ సత్యనారాయణ

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అర్జున్, కార్తీక్

విడుదల తేదీ: 12-07-2019

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంష్‌ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’. ప్రముఖ నిర్మాత ఎం. ఎల్. వీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించగలిగిందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ‌ :

సంజయ్(మేఘాన్ష్) మొదటి చూపులోనే ప్రియ (నక్షత్ర)ను ఇష్టపడతాడు. అయితే ప్రియను పెళ్లి చేసుకోవాలంటే రాజ్‌దూత్ అనే బైక్‌ను తీసుకురావాలని హీరోయిన్ తండ్రి కండిషన్ పెడతాడు. ఇరవై ఏళ్ల క్రితం హీరోయిన్ తండ్రి వదిలేసిన రాజ్‌దూత్‌ను తీసుకురావడం కోసం హీరో పడేపాట్లే ఈ సినిమా కథ. అసలు రాజ్‌దూత్‌కు హీరోకు ఉన్న సంబంధం ఏంటి?, చివరకు సంజయ్ రాజ్‌దూత్‌ను సంపాదించాడా? సంజయ్ ప్రేమ ఫలించిందా.? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు అభినయం:

మొదటి సినిమా అయినా మేఘాన్ష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి డెబ్యూ కాబట్టి.. అద్భుతాలు ఆశించలేం కనకే.. అతడి దగ్గర నుంచి ఫర్వాలేదనిపించే పెర్ఫార్మన్స్ వచ్చింది. ఇక హీరోయిన్ పాత్ర నిడివి తక్కువే అయినా నక్షత్ర ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రాజన్నగా ఆదిత్య బాగానే నటించాడు. మిగిలిన తారాగణం వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేష‌ణ‌ :

అర్జున్, కార్తీక్ దర్శకులుగా ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం.. తెరపై దానిని ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. వారు తీసుకున్న పాయింట్ చిన్నదైనా దాని కథనాన్ని రక్తికట్టించే రీతిలో తెరకెక్కించలేకపోయారు. మేఘాన్ష్‌కు ఈ చిత్రం ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఈ చిత్రానికి ఏ సాంకేతిక విభాగము గొప్పగా పని చేయలేదు. అన్ని సోసోగానే ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • కొన్ని కామెడీ సీన్స్

మైనస్‌ పాయింట్స్‌ :

  • కథ, కథనం