AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biopic: వెండితెరపై కేంద్ర మంత్రి జీవిత చరిత్ర.. రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. హీరో ఎవరో తెలుసా?

భారతీయ సినిమా పరిశ్రంలో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. నాటి మహాత్మా గాంధీ మొదలు నేటి శ్రీలంక ముత్తయ్య మురళీ ధరన్‌ వరకు.. వివిధ రంగాల్లో తమ ప్రత్యేకత చాటుకున్న ప్రముఖలు జీవిత కథలు వెండి తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఇప్పుడు మరో ప్రముఖుడి బయోపిక్‌ కూడా రానుంది. ఆయనే..

Biopic: వెండితెరపై కేంద్ర మంత్రి జీవిత చరిత్ర.. రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. హీరో ఎవరో తెలుసా?
Union Minister Biopic
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2023 | 12:12 PM

భారతీయ సినిమా పరిశ్రంలో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. నాటి మహాత్మా గాంధీ మొదలు నేటి శ్రీలంక ముత్తయ్య మురళీ ధరన్‌ వరకు.. వివిధ రంగాల్లో తమ ప్రత్యేకత చాటుకున్న ప్రముఖలు జీవిత కథలు వెండి తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఇప్పుడు మరో ప్రముఖుడి బయోపిక్‌ కూడా రానుంది. ఆయనే హైవే మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా నితిన్‌ గడ్కరీ. అవును భారత రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జీవిత చరిత్ర త్వరలోనే సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించనుంది. గడ్కరీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షయ్ దేశ్‌ముఖ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనురాగ్ రాజన్ భూసారి దర్శకత్వం వహించారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పోస్టర్‌, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. అయితే నితిన్ గడ్కరీ పాత్రలో ఎవరు నటిస్తారనే మాత్రం వెల్లడించలేదు. దీంతో కేంద్ర మంత్రి పాత్రలో ఎవరో నటిస్తున్నారోని తెలుసుకునేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఈ నిరీక్షణకు తెర దించారు మేకర్స్‌. తాజాగా గడ్కరీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రముఖ నటుడు రాహుల్‌ చోపాడే టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. దీంతో పాటు గడ్కరీ రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. అక్టోబర్‌ 27న గడ్కరీ సినిమా విడుదల కానుంది.

‘ఈ దేశాన్ని రోడ్ల ద్వారా గుర్తిస్తే, నేను నితిన్ జైరామ్ గడ్కరీని అని ఆనందంగా చెప్పగలను’ అని టీజర్‌లో చెప్పినట్లే నితిన గడ్కరీ రాజకీయ జీవితంలో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, న్యాయవాదిగా, అలాగే కీలకమైన క్యాబినెట్ మంత్రిగా నితిన్‌ గడ్కరీ జీవితంలో చోటు చేసుకున్న ప్రధాన అంశాలను ఈ బయోపిక్‌లో ప్రస్తావించనున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు అనురాగ్ రాజన్ భుసారి మాట్లాడుతూ.. ‘ సమకాలీన రాజకీయాల్లో నితిన్ గడ్కరీది అసాధారణ వ్యక్తిత్వం. గడ్కరీ సినిమా పోస్టర్ విడుదలయ్యాక నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నితిన్ గడ్కరీ పాత్రలో ఎవరు నటిస్తారని చాలా మంది అడిగారు. ఒక సాధారణ కార్యకర్త, సామాజిక కార్యకర్త నుంచి కీలకమైన క్యాబినెట్ మంత్రి వరకు సాగిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మందికి ఈ ఇతర ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. నితిన్ గడ్కరీ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండేవారో, ఎలా ఉన్నారో ప్రేక్షకులు ‘గడ్కరీ’ చూసి తెలుసుకోవచ్చు’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

గడ్కరీ ఫస్ట్ లుక్..

గడ్కరీ మూవీ టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.