TOP 9 ET: నవంబర్ 1నే వరుణ్-లావణ్య పెళ్లి | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌పై చిరు షాకింగ్ కామెంట్స్.

Anil kumar poka

|

Updated on: Oct 14, 2023 | 3:34 PM

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లిమిటెడ్ ఎడిషన్‌ను ఆహా ప్రారంభించనుంది. ఈ సీజన్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వస్తున్న ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో భగవంత్ కేసరి టీమ్ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.

01. Varun Tej: పెళ్ళికి వేళాయెరా..!
నవంబర్ 1న ఇటలీలోని బోర్గో సాన్ ఫిలీస్ అనే రిసార్ట్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతుంది. ఇటలీలో ఉన్న లగ్జరీ రిసార్ట్ ఇది. ఓ విలేజ్‌నే పూర్తిగా రిసార్ట్‌గా మార్చేసారు. అందులోనే వరుణ్ మ్యారేజ్ జరగబోతుంది. ఇదిలా ఉంటే వరుణ్ పెళ్లి కోసం మెగా హీరోలంతా ఓ వారం బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ చివరి వారంలోనే అంతా ఇటలీకి పయనం అవుతున్నారు.

02. Chiranjeevi
ఈ మధ్య కాలంలో మీడియా ముందు కనిపించని చిరంజీవి.. చాలా రోజుల తర్వాత కనిపించారు. వచ్చీ రావడంతోనే ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆర్ఆర్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ సినిమా రేంజ్‌ను మార్చేస్తాయంటే తాను నమ్మనని.. ఒళ్లు హూనుం చేసుకుని ఫైట్లు, డాన్సులు చేసి హిట్లు కొట్టడమే తనకు తెలుసు అన్నారు చిరంజీవి. ఈ మధ్య విడుదలైన భోళా శంకర్ ఫ్లాప్‌పై ఈ కామెంట్స్ చేసారు ఈయన.

03.Bhagavanth Kesari
బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం గురించి చెప్పిన అనిల్ రావిపూడి.. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ కాదని.. అందులో పాటలు, కామెడీ సీన్లు ఉండవని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే విడుదలైన 5 రోజుల తర్వాత దంచవే మేనత్త కూతురా రీమిక్స్ సాంగ్ యాడ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.

04.Unstoppable
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లిమిటెడ్ ఎడిషన్‌ను ఆహా ప్రారంభించనుంది. ఈ సీజన్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వస్తున్న ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో భగవంత్ కేసరి టీమ్ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి.

05.OMG 2
అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్‌ బస్టర్‌ ఓ మై గాడ్‌ 2. సెక్స్ ఎడ్యూకేషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్‌. ఓ మైగా గాడ్‌ ఫస్ట్ పార్ట్‌ను వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో రీమేక్‌ చేశారు. ఇప్పుడు సీక్వెల్ రీమేక్‌లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

06. Leo
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లియో సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా యూకేలో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే అక్కడ హైయ్యస్ట్ డే 1 కలెక్షన్స్ వసూలు చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ అధికారికంగా ప్రకటించారు. లండన్‌లో ఆల్ టైం హైయెస్ట్ డే 1 అందుకోబోతుంది లియో. అక్టోబర్ 19న విడుదల కానుంది ఈ చిత్రం.

07.Vyuham
రామ్ గోపాల్ వర్మ మరోసారి పొలిటికల్ మూవీస్‌తో వస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఈయన తెరకెక్కిస్తున్న వ్యూహం పార్ట్ 1 ట్రైలర్ విడుదలైంది. సినిమా నవంబర్ 10న విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు వర్మ. తనకు వైఎస్ జగన్‌పై ఓ అభిప్రాయం ఉంది కాబట్టి సినిమా చేసానని.. తనకు అనిపించింది కాదు నిజాలు సినిమాలో చూపించానని చెప్పారు.

08.Tiger Nageswara Rao
రవితేజ హీరోగా వంశీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్ విడుదలయ్యాయి ఈ సినిమా నుంచి. తాజాగా మూడో పాట విడుదలైంది. ఈ సారి ఫుల్ రొమాంటిక్ బీట్‌తో వచ్చేసారు రవితేజ. జివి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.

09.Tejas
తేజస్ లాంటి సినిమా చేయటం గర్వంగా ఉందన్నారు నటి కంగనా రనౌత్‌. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుల మనోభావాలను, భావోద్వేగపు ప్రయాణాలను చూపిస్తూ ఈ సినిమాను రూపొందించామన్నారు. సర్వేష్‌ మేవారా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 14, 2023 01:10 PM