AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News: బాలీవుడ్‏లో కొత్త రచ్చ… సంచలనం రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు..

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు,

Bollywood News: బాలీవుడ్‏లో కొత్త రచ్చ... సంచలనం రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు..
Tapsee Sonam
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2021 | 12:19 PM

Share

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు, దర్శకులతో మానసికంగా ఇబ్బంది పెట్టారని పలువురు తారలు బహిరంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై మీటూ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. ఇప్పటికీ పలువురు తారలు క్యాస్టింగ్ కౌచ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. అయితే ఇప్పుడు మరో ఇండస్ట్రీలో మరో రచ్చ మొదలైంది. పరిశ్రమలో పేగ్యాప్ ఎక్కువగా ఉంటుందని పలువురు హీరోయిన్స్ ఇప్పటికే చెప్పారు. హీరోల రెమ్యునరేషన్ తో పోలిస్తే.. హీరోయిన్స్ కు చాలా తక్కువగా పారితోషికం ఇస్తారని.. జెండర్ తేడా ఎక్కువగా చూపిస్తారని చెప్పుకోచ్చారు బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.

ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా రెండో దశ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. అలాగే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్న పే గ్యాప్ వివాదంపై సోనమ్ స్పందించారు. “సినిమాల్లో మహిళల పాత్రల విషయంలో చాలా మార్పులు జరిగాయి. కానీ.. వేతనాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. రెమ్యునరేషన్ గురించి ఇలా స్పందించడం కామెడిగా అనిపిస్తోంది. పేగ్యాప్ కు నేను మద్దతు తెలుపుతాను. కానీ ఆ తర్వాత నాకు అవకాశాలు రావు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ విషయాన్ని నేను గ్రహించాను. ఎవరి విషయంలోనైనా తీర్పు చేప్పే హక్కు నాకు లేదు. ” అంటూ చెప్పుకోచ్చింది.

ఇటీవల మరో హీరోయిన్ తాప్సీ పన్నూ కూడా ఇదే విషయంపై స్పంధించారు. హీరోలు రెమ్యునరేషన్ పెంచితే వారి విజయంగా భావిస్తారు. కానీ హీరోయిన్స్ పారితోషికం పెంచితే తనతో సమస్యలే అంటూ పుకార్లు సృష్టిస్తారని చెప్పుకోచ్చింది. తనతోపాటు కలిసి కెరీర్ ఆరంభించిన హీరోలు ప్రస్తుతం 3-5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిపింది. తక్కువ బడ్జెట్ తో మహిళా ఓరియెంటెడ్ సినిమాలు తీసిన ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారని.. కానీ.. ఇప్పటికి లేడి ఓరియెంటెడ్ సినిమాలు తక్కువే అని చెప్పుకోచ్చారు.

Also Read: Rashmika Mandanna: రష్మికకు జంతువులంటే అమితమైన ప్రేమ.. పావురం దగ్గర్నుంచి కుక్క పిల్లల వరకు అన్నింటినీ..

Radha: రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసిన హీరోయిన్.. చిత్రహింసలు పెడుతూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని..