
గత కొద్ది కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోస్ చిత్రాలు.. భారీ బడ్జెట్ సినిమాలకు ఈ బాయ్ కాట్ సెగ తగులుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ పై నెగిటివిని పెంచేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికే అమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. భారీ అంచనాలతో ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఇక ఇప్పుడు ఈ బాయ్ కాట్ ట్రెండ్ షారుఖ్ చిత్రానికి కూడా తగులుతుంది. నవంబర్ 2న షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన పఠాన్ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత కింగ్ ఈ చిత్రంతో స్క్రీన్ పై సందడి చేయనున్నారు. అయితే మంచి స్పందనతో దూసుకుపోతున్న ఈ టీజర్‌కు.. ఇప్పుడు బాయ్ కాట్ వివాదం చుట్టుముడుతుంది. ఈ సినిమాను బహిష్కరించాలంటూ డిమాండ్ వినిపిస్తోంది.
షారుఖ్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో అనేక ట్వీట్స్ వైరలవుతున్నాయి. కేవలం పఠాన్ చిత్రమే కాకుండా.. బాద్ షా గతంలో నటించిన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ షేర్ చేస్తూ బాయ్ కాట్ పఠాన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. #BoycottPathan అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. మొత్తానికి బాయ్ కాట్ సెగ ఇప్పుడు షారుఖ్ చిత్రాన్ని వెంబడిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ మరణం అనంతరం బీటౌన్ స్టార్స్ పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోస్ చిత్రాలను బాయ్ కాట్ చేయాలని.. సుశాంత్ మరణానికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు అభిమానులు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం షారుఖ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది.
शाहरुख खान ने कहा -: किसी की हिम्मत नहीं “पठान” को फ्लॉप करवा सके, “पठान” फ्लॉप हुई तो भारत छोड़ कर चला जाऊंगा, तो कौन- इसको देश छोड़ने में सहयोग करेगा, कमेंट में #BoycottPathan लिखकर, नशेड़ी की औकात दिखा ही दो हिंदुओं, स्टार्ट..??? pic.twitter.com/dZudszSKv1
— Sonu Nigam?? (@Nationalist1101) November 5, 2022
Boycott Bollywood completely #BoycottPathan pic.twitter.com/uJXVNYp7I6
— ?अंकित सिंह राजपूत ?#SaveSoilArmy (@Ankit_Singh8052) November 4, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.