AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahid Kapoor: అప్పుడు అవమానిస్తే బాధపడ్డాను.. ఇకపై అస్సలు ఊరుకోను.. షాహిద్ కపూర్ సంచలన కామెంట్స్..

తన తల్లితండ్రుల పేర్లు ఏమాత్రం వాడుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కబీర్ సింగ్, జెర్సీ, బ్లడీ డాడీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీలో తనను బయటివ్యక్తిలాగే చూశారని.. ఎన్నో అవమానాలను, వేధింపులను ఎదుర్కొన్నానని అన్నారు. ఇటీవల 'నో ఫిల్టర్ నేహా' ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన ఆరోపణలు చేశారు.

Shahid Kapoor: అప్పుడు అవమానిస్తే బాధపడ్డాను.. ఇకపై అస్సలు ఊరుకోను.. షాహిద్ కపూర్ సంచలన కామెంట్స్..
Shahid Kapoor
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2024 | 7:48 AM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన హీరో షాహిద్ కపూర్. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. అతను మాత్రం ఒక బయటివ్యక్తిలాగే కెరీర్ ప్రారంభించాడు. అతడి తండ్రి సీరియల్స్ లో నటించాడు. అలాగే తల్లి బుల్లితెరపై ప్రముఖ రచయిత.. నటి కూడా. కానీ తన తల్లితండ్రుల పేర్లు ఏమాత్రం వాడుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కబీర్ సింగ్, జెర్సీ, బ్లడీ డాడీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీలో తనను బయటివ్యక్తిలాగే చూశారని.. ఎన్నో అవమానాలను, వేధింపులను ఎదుర్కొన్నానని అన్నారు. ఇటీవల ‘నో ఫిల్టర్ నేహా’ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన ఆరోపణలు చేశారు. నటీనటులు కుమారుడి అయినా.. తనను ఓ బయటి వ్యక్తిలాగే చూసి తనపట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించారని గుర్తుచేసుకున్నారు.

“నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఇది నేను ఒక పాఠశాల లాంటిదని భావించాను. ఇక్కడ నా తల్లితండ్రులు నటీనటులు అయినా.. ఎలాంటి ప్రయోజనం పొందలేదు. ఇక్కడ స్టార్స్, సూపర్ స్టార్స్, డైరెక్టర్స్ కు మాత్రమే అలాంటి శక్తి ఉంటుంది. మాములు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కాదు. ఇక్కడ బయటివ్యక్తులకు అంతగా అవకాశాలు ఇవ్వరు. ఇక్కడ బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. ఒకరికి ఒకరు సహకరించాలి.. కానీ వారు అలా ఉండరు. దీంతో ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నాను. ఎన్నో సవాళ్లను.. అవమానాలను దాటుకుని నా ప్రతిభతో.. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను.” అని అన్నాడు.

“మేము ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చినప్పుడు స్కూల్లో అందరు నా యాస కారణంగా దూరం పెట్టేవారు. అక్కడ ఎన్నో వేధింపులు వచ్చాయి. ఇలాగే కొన్నేళ్లకు సినీ పరిశమ్రలోకి వచ్చిన తర్వాత వేధింపులకు గురయ్యాను. ఇక్కడ బయటి వ్యక్తులను సులభంగా అంగీకరించరు అని తెలుసుకున్నాను. అవకాశాల కోసం ఇతరులతో కలిసి తిరిగేరకాన్ని కాదు. ఇతరులను ఎదగకుండా చేయడం, అవమానించడం సరికాదు.. టీనేజ్ లో తిరిగి పోరాడేంత శక్తి నాకు లేకపోయింది. కానీ ఇప్పుడు నన్ను వేధించాలని చూస్తే మాత్రం అసలు ఊరుకోను. తిరగబడతాను. ఇతరులను వేధించి ఆనందించేవాళ్లను నేను కూడా వేధిస్తాను. దానికి వారు అర్హులు” అని అన్నారు.