TOP9 ET: లాఠీ ఝుళిపించే పోలీస్‌గా రెబల్ స్టార్ | నెత్తురు మరిగేలా పవన్ మాటలు.!

TOP9 ET: లాఠీ ఝుళిపించే పోలీస్‌గా రెబల్ స్టార్ | నెత్తురు మరిగేలా పవన్ మాటలు.!

Anil kumar poka

|

Updated on: Mar 01, 2024 | 10:54 AM

సలార్‌లో తన యాక్షన్ సైజ్.. ఏ రేంజో చూపించిన పాన్ ఇండియా రెబల్‌ స్టార్ ప్రభాస్‌ను.. తన స్టైల్లో చూపించేందుకు రెడీ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగా..! ఈ సారి కాస్త పద్దతిగా.. పోలీస్‌ డ్రెస్‌లో లాఠీ ఝుళిపించే యాంగ్రీ యంగ్ పోలీస్‌గా.. ప్రభాస్‌ను చూపిస్తానంటూ.. చెప్పకనే చెప్పారు ఈయన. ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోందని.. ఆ తర్వాతే యానిమల్ సీక్వెల్.. యానిమల్ పార్క్‌పై వర్క్‌ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు కూడా...!

01.prabhas
లాఠీ ఝుళిపించే పోలీస్‌గా రెబల్ స్టార్స

లార్‌లో తన యాక్షన్ సైజ్.. ఏ రేంజో చూపించిన పాన్ ఇండియా రెబల్‌ స్టార్ ప్రభాస్‌ను.. తన స్టైల్లో చూపించేందుకు రెడీ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగా..! ఈ సారి కాస్త పద్దతిగా.. పోలీస్‌ డ్రెస్‌లో లాఠీ ఝుళిపించే యాంగ్రీ యంగ్ పోలీస్‌గా.. ప్రభాస్‌ను చూపిస్తానంటూ.. చెప్పకనే చెప్పారు ఈయన. ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోందని.. ఆ తర్వాతే యానిమల్ సీక్వెల్.. యానిమల్ పార్క్‌పై వర్క్‌ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు కూడా…!

02.naga babu
నన్ను క్షమించండి
తప్పు ఒప్పుకున్న నాగబాబు

రీసెంట్‌ డేస్‌లో… మాటల్లో కంటే.. తన ట్వీట్లలో ఎక్కువగా వైరల్ అవుతున్న మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా క్షమించండి అంటూ ఓ ట్వీట్ చేశారు. తన కొడుకు వరుణ్ తేజ్‌ ఆపరేషన్ వ్యాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. పోలీసు క్యారెక్టర్ 6అడుగుల మూడు అంగులాలు ఉన్న వ్యక్తులు చేస్తే బాగుంటుందని.. అలా కాకుండా 5 అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే నప్పదన్నట్టు మాట్లాడారు. అయితే ఈ మాటలనే.. తాను వెనక్కి తీసుకుంటున్నట్టు నాగ బాబు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఎవరైనా నొచ్చికుని ఉంటే.. ఐయామ్‌ రియల్లీ వెరీ సారీ అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశారు ఈయన.

03.pawam
‘పవన్‌ మాటలకు
రోమాలు నిక్కపొడవడం కాదు..
నెత్తురు మరుగుతోంది’

పవన్‌ సినిమాలు రాకున్నా.. పవన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తుంటుంది ఆయన ఉపన్యాసాలు… ఆ ఉపన్యాసంలో ఉన్న డైలాగులు! ఇక తాజాగా తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభలో.. పవన్‌ తన స్పీచ్ చివర.. జగన్‌కు వ్యతిరేకంగా చెప్పిన మాటలు.. ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్‌ తెప్పిస్తున్నాయి. దానికితోడు జనసేనాని చెప్పిన ఈ డైలాగులకు కొంత మంది సలార్ బీజీఎమ్‌ యాడ్ చేసి.. నెట్టింట వైరల్ చేస్తున్నారు. వైరల్ చేయడమే కాదు ఆ వీడియో చూస్తే గూస్ బంప్స్‌ ఏంటి..? నరాల్లో 99 స్పీడ్లో రక్తం పరిగెడుతోందంటూ.. క్రేజీ గా కామెంట్స్ చేస్తున్నారు.

04.drushyam
హాలీవుడ్‌లో రిమేక్ అవుతున్న ‘దృశ్యం’

హాలీవుడ్ సినిమాలు మన దగ్గర రిమేక్ అవ్వడం కామన్. కానీ ఫర్‌ ఏ చేంజ్‌ మన సినిమానే హాలీవుడ్ గడ్డపై రీమేక్ అవుతోంది. జీతూ జోసెఫ్ డైరెక్షన్లో తెరకెక్కి.. ఆల్మోస్ట్ పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దృశ్యం మూవీ.. ఇప్పుడు హాలీవుడ్‌లో రిమేక్ అవుతోంది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన గల్ఫ్‌ స్ట్రీమ్ పిక్చర్స్‌, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాను హాలీవుడ్‌లో రిమేక్ చేయనుంది. ఇండియన్‌ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌ నుంచి ఇంటర్నేషనల్‌ రీమేక్‌ రైట్స్‌ను కూడా కొనుగోలు చేసింది.

05.krish
డ్రగ్ కేస్‌.. పరారీలో డైరెక్టర్ క్రిష్‌

రాడిసన్ డ్రగ్స్‌ కేసు సంగతేమో కానీ.. డైరెక్టర్ క్రిష్ మ్యాటర్ మాత్రం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో.. ఈ కేసులో A10 నిందుతుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నట్టు పేర్కొనడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు CrPc160 కింద క్రిష్‌కు నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు కోర్టుకిచ్చిన రిమాండ్‌ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. అయితే అంతుకు ముందే క్రిష్‌ .. తాను ముంబయ్లో ఉన్నట్టు.. విచారణకు 2 రోజుల తర్వాతే హాజరవుతానని పోలీసులకు చెప్పినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది.

06.samantha
ఎన్నికల వేళ.. సమంతను వాడేసుకుంటున్న TDP

ఎలక్షన్స్ వస్తే.. రాజకీయనాయకులనే కాదు.. వాళ్లను ప్రచారం చేసే పనిని ఎత్తుకున్న కొంత మంది సెలబ్రిటీలు కూడా బిజీ అయిపోతుంటారు. వారి క్యాంపెయిన్ వీడియోలతో నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా సమంత కూడా ఓ వీడియోతో వైరల్ అవుతున్నారు. ఆ వీడియోలో టీడీపీకే ఓటు వేయమని సమంత చెబుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ.. సమంతకు థ్యాంక్స్ చెబుతున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే! టీడీపీకి ఓటేయండి అంటూ సమంత చెబుతున్నట్టుగా ఉన్న ఈ వీడియో పాతది. త్రో బ్యాక్ వీడియో ఇది! అందరూ దీన్ని గమనించండి!

07.pawan allu arjun
పవన్ నోట అల్లు అర్జున్ మాట..
నెట్టింట అల్ల కల్లోలం

పవన్‌కుంది హై పవర్‌రేంజ్‌. అందుకే పవన్ నోటి నుంచి ఓ హీరో పేరు బయటికి వస్తే చాలు.. ఆదో అచీవ్‌మెంట్‌గా.. ఆ హీరో ఫ్యాన్స్‌ను ఫీలయ్యేలా చేస్తోంది. ‘పవన్ నోట మా హీరో మాట’.. అని ఎగిరిగంతేసేలా చేస్తుంది. ఇక తాజాగా జరిగిన జెండా సభలో జనసేనాని పవన్‌.. పుష్ప గురించి అల్లు అర్జున్ గురించి కాస్త పొగుడుతూ చెప్పడం నెట్టింట వైరల్ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్ కారణంగా ట్రెండ్ అవుతోంది.

08.deepika
‘తల్లి కాబోతున్నా.. ‘
నిజం దాచినా.. దాగదుగా..

అందరూ అనుకున్నట్టే దీపిక ఎక్కువ రోజులు నిజాన్ని దాచిపెట్టలేకపోయింది. అందిరికీ చెబితేనే బెటర్ అనుకుంది అందుకే తను తల్లి కాబోతున్నా అంటూ.. సెప్టెంబర్లో తన బేబీకి జన్మనివ్వబోతున్నా అంటూ.. తన ఇన్‌స్టా ద్వారా రివీల్ చేసింది. ఇక ఈ న్యూస్‌తోనే నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. దాంతో పాటే తన ఫ్యాన్స్‌ నుంచి కుప్పలు తెప్పులుగా విషెస్ అందుకుంటోంది.

09.Chinmai
బ్రేకింగ్ : సింగర్‌ పై పోలీస్‌ కేస్‌

మాటలు వ్యక్తిగతం..! కొన్ని రోజులకు ఎలాగూ అవుతాయి గతం. కానీ ఇవి పట్టించుకోని కొంత మంది కొందరి మాటలను తప్పుబడతారు. విమర్శిస్తారు. ఆ క్రమంలోనే నోరు జారీ.. అందరి మనోభావాలుదెబ్బతీసే డైలాగులు చెప్పి పోలీస్‌ కేసుల్లో ఇరుక్కుంటారు. ఇక తాజాగా స్టార్ సింగర్ చిన్మయి అదే చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ అమ్మాయిల గురించి మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఓ వీడియో చేసిన చిన్మయి.. ఆ వీడియోలో.. ఆవేశంతో.. ‘ఈ దేశంలో పుట్టడం నా కర్మ, ఇదో స్టుపిడ్‌ కంట్రీ’ అంటూ ఓ లైన్ చెప్పింది. ఇక ఈ లైన్‌తో నొచ్చుకున్న HCU విద్యార్థి సాగర్‌.. ఈమె పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Mar 01, 2024 10:53 AM