Salman Khan: సల్లూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ వస్తోంది
ఈ మధ్యన సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. లేటెస్ట్ గా సికందర్ కూడా ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే సల్మాన్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే.. తన బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ త్వరలోనే పట్టాలెక్కనుందట.

సల్మాన్ ఖాన్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాలలో ‘బజరంగీ భాయిజాన్’ ఒకటి. ఈ సినిమా సరిగ్గా 10 సంవత్సరాల క్రితం విడుదలై సూపర్ హిట్ అయింది. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించగా, హర్షాలి మల్హోత్రా మున్నీ పాత్రలో అద్బుతంగా నటించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురావడానికి ఇప్పుడు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. సల్మాన్ ఖాన్ ఇటీవల దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను కలిశారని సమాచారం. ఇది విన్న సల్మాన్ అభిమానులు సంతోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘బజరంగీ భాయిజాన్’ చిత్రానికి కథ రాశారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, రాక్‌లైన్ వెంకటేష్, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. భారతదేశానికి వచ్చి తప్పిపోయిన మున్నీ అనే పాకిస్తానీ అమ్మాయిని తిరిగి తన స్వస్థలానికి చేర్చడమే ఈ సినిమా కథ. ఇప్పుడు సల్లూకి అత్యవసరంగా ఒక భారీ విజయం అవసరం. అందుకే తన బ్లాక్ బస్టర్ సినిమాకు రెండవ భాగం తీయాలనే ఆలోచన వచ్చింది.
సల్మాన్ ఖాన్, విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ముంబైలో కలుసుకున్నారు. వారిద్దరూ ‘బజరంగీ భాయిజాన్ 2’ సినిమా కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ కథను మరింత డెవలప్ చేసి సరైన రూపంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ భుజాలపై పడింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తారా?లేదా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక బజరంగీ భాయిజాన్ సినిమాలో మున్నీ పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. మరి సీక్వెల్ కథ కూడా ఇదే కోణంలో కొనసాగుతుందా లేదా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సాధారణంగా విజయేంద్ర ప్రసాద్ కథ రాశారంటే సినిమా సూపర్ హిట్ అయినట్లే. మరి ఆయనైనా సల్మాన్ కు భారీ విజయం అందించాలని హీరో అభిమానులు కోరుకుంటున్నారు.
మరోవైపు సల్మాన్ ప్రస్తుతం గంగారామ్ సినిమ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Can’t wait to see Salman Khan and Sanjay Dutt team up for the rustic action film Ganga Ram! 🎬 Excited to see what Krrish Ahir brings to the table as a director! #SalmanKhan #SanjayDutt #PAKvNZ #GangaRam #NintendoDirect #NintendoDirectJP @BeingSalmanKhan @duttsanjay pic.twitter.com/QvVHxRO0Lx
— Bharat_say (@Bharat_say) April 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..