AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sikandar: సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్, రష్మికల సికందర్.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'సికందర్'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది, రంజాన్ పండగల కానుకగా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Sikandar: సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్, రష్మికల సికందర్.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా?
Sikandar Movie
Basha Shek
|

Updated on: Mar 23, 2025 | 11:44 AM

Share

సాధారణంగా సినిమాలు గురువారం లేదా శుక్రవారం థియేటర్లలో రిలీజవుతుంటాయి. అయితే సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం మాత్రం ఆదివారం విడుదల కానుంది. అవును.. ఉగాది, రంజాన్ పండగలను పురస్కరించుకుని మార్చి 30 న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా విడుదలవుతుండడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ శుక్రవారం (మార్చి 21)తో పూర్తయింది. థియేటర్లలో విడుదల కానున్న ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 38 సెకన్లు. ఇక సినిమా నిడివి 150.8 నిమిషాలు. అంటే 2 గంటల 30 నిమిషాల పాటు మూవీ ఉంటుంది. ఇక సికందర్ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది, అంటే 13 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు దీనిని చూడవచ్చు.

కాగా ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో అభిమానుల ఆశలన్నీ సికందర్ పైనే ఉన్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. దీని ద్వారా, సల్మాన్ ఖాన్ వారిని తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ‘సికందర్’ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ రష్మిక మందన్నా. ఇటీవల ఆమె నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. . ఇప్పుడు, ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని రష్మిక అభిమానులు కోరుకుంటున్నారు. ఏఆర్ మురుగదాస్ గతంలో ‘గజిని’ సినిమా తీశారు. అది హిట్ అయింది. అలాగే ‘కత్తి’, ‘తుపాకి’, ‘సర్కార్’, ‘దర్బార్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అందుకే ఈ సికందర్ సినిమాపై సల్మాన్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియావాలా నిర్మించారు.

ఇవి కూడా చదవండి

అడ్వాన్స్ బుకింగ్ అప్పటినుంచే..

ఉగాది, రంజాన్ కానుకగా…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు