Tadap Trailer: మెగాస్టార్‌ను ఫిదా చేసిన ‘ఆర్‌ఎక్స్ 100’ హిందీ రీమేక్ ట్రైలర్ చూశారా.? అదే ఇంటెన్సిటీ..
Tadap Trailer: 2018లో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా...
Tadap Trailer: 2018లో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే అబ్బాయి జీవితం ఎలా మారిందనన్న ఇంటెన్సివ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇక ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ల కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ఇదిలా ఉంటే తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమాను హిందీలో తడప్ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి ఈ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇక తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తోంది. మిలాన్ లుతారియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ను గమనిస్తే.. ఆర్‌ఎక్స్100 ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఇంటెన్సివ్, యాక్షన్ సన్నివేశాలు, హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు కనిపిస్తున్నాయి.
ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా హిందీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ట్రైలర్ చూసిన చిరు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘రా అండ్ ఇంటెన్స్.. తడప్ ట్రైలర్ చాలా బాగుంది. ఆహాన్ శెట్టి, చిత్ర యూనిట్‌కు నా ప్రేమతో పాటు, సినిమా విజయవంతం కావాలని విషెస్ పంపిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు చిరు.
RAW & INTENSE! #SajidNadiadwala’s #TadapTrailer looks impressive! ?
Love & good wishes to #AhanShetty & the team! https://t.co/ZvewVcBFTQ#Tadap #FoxStarStudios @TaraSutaria @MilanLuthria @rajatsaroraa @ipritamofficial @NGEMovies @foxstarhindi @WardaNadiadwala @TSeries
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 27, 2021
Pooja Hegde: విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తోన్న పూజా హెగ్డే.. ఎక్కడో తెలుసా..
Telangana: పోడు రైతులకు గుడ్ న్యూస్.. భూముల సమస్యకు చెక్.. సీఎం ఆదేశాలు