Rashmika Mandanna: శ్రీవల్లి తగ్గేదే లే.. ‘యానిమల్’ సినిమా కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..
రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో అలరించింది. కానీ ఈ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడు రష్మిక ఆశలన్ని యానిమల్ చిత్రంపైనే ఉన్నాయి. ఈ మూవీకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన రణబీర్ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక ఇటీవల విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ గురించి చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో అలరించింది. కానీ ఈ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడు రష్మిక ఆశలన్ని యానిమల్ చిత్రంపైనే ఉన్నాయి. ఈ మూవీకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన రణబీర్ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక ఇటీవల విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ గురించి చెప్పక్కర్లేదు. మెడలో తాలిబొట్టు.. పట్టు చీరలో మరాఠీ గృహిణీగా ఆకట్టుకుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై రోజు రోజుకీ పాజిటివ్ బజ్ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ కోసం నటీనటుల రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Dil Raju acquires Sandeep Reddy Vanga’s AP/TS theatrical rights for a whopping amount of ₹15 cr.
It is being said that #DilRaju watched some rushes of #Animal and was impressed very much with #SandeepReddyVanga’s taking and #RanbirKapoor‘s performance.
Hence he bought the… pic.twitter.com/IxQNnTLx3r
— Manobala Vijayabalan (@ManobalaV) September 26, 2023
రణబీర్ కపూర్ చివరిసారిగా ఝూతి మైన మక్కార్ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు అతను దాదాపు రూ25 నుంచి 30 కోట్ల వరకు తీసుకున్నారు. ఇప్పుడు తన పారితోషికాన్ని దాదాపు మూడు రెట్లు పెంచినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం మొత్తం రూ.70 కోట్లు భారీ మొత్తాన్ని తీసుకున్నట్లుగా సమాచారం.
View this post on Instagram
ఇక రష్మిక విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం రూ.4 కోట్లు పారితోషికం తీసుకుందని తెలుస్తోంది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. ముందుగా ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి డిసెంబర్ 1కి వాయిదా పడింది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
