Alia Bhatt : మరోసారి రీపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్.. ఆ యంగ్ హీరోకు జోడీగా రెండోసారి నటించనున్న అలియా..
బాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మోస్ట్ టాలెంటెడ్ అన్న పేరున్న హీరో హీరోయిన్లు మరోసారి కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు.
Alia Bhatt : బాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మోస్ట్ టాలెంటెడ్ అన్న పేరున్న హీరో హీరోయిన్లు మరోసారి కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. గల్లీ బాయ్ సినిమాలో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న అలియా భట్, రణవీర్ సింగ్ మరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను మరోసారి తెర మీదకు తీసుకువస్తున్నారు స్టార్ మేకర్ కరణ్ జోహార్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మేలో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా… పాండమిక్ కారణంగా కుదరలేదు. సో కాస్త ఆలస్యంగా జూలై ఎండింగ్‌లో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఈ క్రేజీ మూవీతోనే కరణ్ డైరెక్టర్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ రూపొందించటంలో స్పెషల్ ఇమేజ్ ఉన్న కరణ్… రణవీర్, అలియా కాంబినేషన్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి. ఇక అలియా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాకోసం అలియా తెలుగు కూడా నేర్చుకుంటుంది. ఇటీవల కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగాఉందామని ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఓ మెసేజ్ ను వీడియో రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వీడియోలో అలియా తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ షూటింగ్ చివరిదశలో ఉంది. కరోనా కల్లోలం తగ్గుమొఖం పట్టిన వెంటనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :