Ram Gopal Varma: అమితాబ్ తో ఆర్జీవీ సినిమా ఎలా ఉండబోతుంది..? బిగ్ బి కోసం వర్మ భారీ ప్లాన్ వేస్తున్నారా..?

రామ్‌ గోపాల్ వర్మ హిట్ సినిమా తీసి చాలా కాలమే అవుతోంది. ఈ మధ్య కాలంలో కటెంట్‌తో కన్నా కాంటవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు వర్మ..

Ram Gopal Varma: అమితాబ్ తో ఆర్జీవీ సినిమా ఎలా ఉండబోతుంది..? బిగ్ బి కోసం వర్మ భారీ ప్లాన్ వేస్తున్నారా..?
Rgv
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2021 | 3:49 PM

Big B Varma: రామ్‌ గోపాల్ వర్మ హిట్ సినిమా తీసి చాలా కాలమే అవుతోంది. ఈ మధ్య కాలంలో కటెంట్‌తో కన్నా కాంటవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు వర్మ. హడావిడి చేసి సినిమా రిలీజ్ చేయటం.. తరువాత నెగెటివ్‌ టాక్‌తో ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయటం వర్మకు అలవాటైపోయింది. ఈ టైమ్‌లో క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. రామ్‌ గోపాల్ వర్మతో ఓ సినిమా చేసేందుకు బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వర్మ, అమితాబ్‌ల మధ్య మంచి రిలేషనే ఉంది. అమితాబ్ కెరీర్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్కార్‌ లాంటి బిగ్ హిట్ ఇచ్చి ఆదుకున్నారు వర్మ. అయితే అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. మానేశారో, మర్చిపోయారో తెలియదుగానీ.,. వర్మ హిట్ సినిమా తీసి చాలా కాలమే అవుతోంది. అమితాబ్ బచ్చన్- రామ్ గోపాల్ వర్మ కాంబోలో ‘సర్కార్‌’ మూవీ వచ్చింది. 2005 సంవత్సరంలో పొలిటికల్‌ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించగా అభిషేక్ బచ్చన్, కోట శ్రీనివాసరావు, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించి అలరించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా 2008లో ‘సర్కార్ రాజ్‌’, 2017లో ‘సర్కార్‌ 3’ విడుదలై సక్సెస్ అందుకున్నాయి.

ఈ టైమ్‌లో అమితాబ్‌.. వర్మతో సినిమా చేసేంత రిస్క్ చేస్తారా..? అన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. ముంబై నుంచి హైదరాబాద్‌కి ఆ తరువాత గోవాకి మకాం మార్చిన వర్మ… మళ్లీ ముంబైకి చేరే ప్రయత్నాల్లో ఉన్నారట. అందుకే అమితాబ్‌ సినిమాతో బాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే అమితాబ్ తో మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బిగ్ బి గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prudhvi Raj: శ్రీహరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృథ్వి

The Family Man 2: ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ పై ముదురుతున్న వివాదం.. సిరీస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన సీనియర్ డైరెక్టర్