Rakhi Sawant : రాఖీసావంత్‌కు అండగా సల్మాన్ ఖాన్.. దేవుడిచ్చిన సోదరుడు అంటూ ఎమోషనల్ అయిన నటి..
వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే రాఖీసావంత్ కు కొండంత కష్టం వచ్చింది. ఆమె తల్లి జయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నారు.
Rakhi Sawant thanks Salman Khan : వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే రాఖీసావంత్ కు కొండంత కష్టం వచ్చింది. ఆమె తల్లి జయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె కు ఆర్ధిక సాయం అందించేందుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో రాఖీసావంత్ తల్లి జయ సల్మాన్ ఖాన్ కు అతని సోదరుడు సోహైల్ ఖాన్ కు తమకు ఆర్థిక సహాయంతో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాఖీసావంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రాఖీ సావంత్ తన తల్లి ఆసుపత్రి ఖర్చుల మొత్తం సల్మాన్ అతని సోదరుడు సోహైల్ చూసుకున్నారని గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సల్మాన్ ను దేవదూత అంటూ.. సల్మాన్ సార్ లాంటి సోదరుడు మాకు దొరకడం దేవుడి ఆశీర్వాదం అని రాఖీ సావంత్ పేర్కొంది. అలాగే సల్మాన్ అతడి సోదరుడు ప్రతిరోజు డాక్టర్స్ తో మాట్లాడుతూ చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారని రాఖీసావంత్ తెలిపారు.
ఇక రాఖీసావంత్ ఇటీవల సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఫైనల్ వరకు చేరిన రాఖీ 14 లక్షలతో బయటకు వచ్చేసింది. అంతకు ముందు మంగళవారం తల్లి ఫొటోలు షేర్ చేసిన రాఖీ.. ‘‘అమ్మ క్యాన్సర్ తో పోరాడుతుంది ఆమె కోసం ప్రార్థించండి’’ అని విజ్ఞప్తి చేసింది. బిగ్‌బాస్ షో నుంచి బయటకు తర్వాత మీడియాతో మాట్లాడిన రాఖీ, తన తల్లిని కాపాడుకునేందుకు ఎంత కష్టాన్నైన్నా భరిస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక షో ద్వారా వచ్చిన డబ్బుతో తనకు చికిత్స చేయిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సల్మాన్ అతడి సోదరుడు సాయం అందించడంతో రాఖీ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
Rajinikanth : షూటింగ్ కు రెడీ అవుతున్న సూపర్ స్టార్.. ‘అన్నాతే’ను పూర్తిచేయనున్నరజినీకాంత్..
హీరోయిన్స్‌గా గ్లామర్ నే కాదు విలన్స్‌గా నెగిటివ్ షెడ్స్ ను చూపించిన తారలు వీరే..