Deepika Padukone : హోటల్‌కు వెళ్లిన దీపిక.. ఎగబడ్డ జనాలు.. పర్స్ లాగే ప్రయత్నం.. అసహనం వ్యక్తం చేసిన అమ్మడు
సెలబ్రిటీలు జనాల్లోకి వెళ్తే ఇంకేమైనా ఉందా ఎగపడిబోరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న వారినే బయట జనాలు వదలడం లేదు.
Deepika Padukone : సెలబ్రిటీలు జనాల్లోకి వెళ్తే ఇంకేమైనా ఉందా ఎగపడిబోరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న వారినే బయట జనాలు వదలడం లేదు. బయట కనపడితే చాలా సెల్ఫీలని ఎగబడిపోతున్నారు, అలాంటిది సినిమా తారలు కనిపిస్తే వదులుతారా.. గతంలో చాలా మంది సినిమావాళ్ళు పబ్లిక్ లోకి వెళ్లి పడరానిపాట్లు పడ్డారు. జనం ఒక్కసారిగా మీదపడిపోవడంతో అసహనం వ్యక్తం చేసారు. ఇక హీరోలైతే కొన్నిసార్లు నోటికి కూడా పనిచెప్పారు. మరికొంతమంది అభిమానులను కొట్టిన సందార్భాలు కూడా ఉన్నాయి.
స్టార్ హీరోయిన్ పబ్లిక్ లోకి వెళ్తే పడరాని ఇబ్వ్బందులు పడతారు. అభిమానులు ఒక్కసారిగా మీదపడిపోయి ఊపిరాడనివ్వరు. అందుకే ఏమాత్రం గ్యాప్ దొరికిన సినిమా తారలు విదేశాలకు ఎగిరిపోతుంటారు. అయితే ఇటీవల ఓ ముద్దుగుమ్మ కూడా జనాల్లోకి వెళ్లి ఇబ్బంది పడింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. దీపిక గురువారం రాత్రి ఒక హోటల్ నుంచి బయటకు వస్తూ అభిమానుల కంటపడింది. డిన్నర్ ముగించుకొని హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడున్నవారు ఒక్కసారిగా దీపికను చుట్టుముట్టారు.
దాంతో వారిని తప్పించుకొని తన కారుదగ్గరకు వెళ్ళడానికి దీపికకు కష్టమైంది. బాడీగార్డులు సహాయంతో రెండు అడుగులు వేసినప్పటికీ అభిమానులు ఆమెను పైకి ఎగబడ్డారు. అయితే అభిమానులతోపాటు ఆ వీధిలో వస్తువులు అమ్ముతున్న కొందరు మహిళలు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ గందరగోళంలో ఒక మహిళదీపికా హ్యాండ్ బ్యాగ్ ను లగే ప్రయత్నం చేసింది. వెంటనే అక్కడున్న ఆమె బాడీగార్డ్స్ దీపికా బ్యాగ్ ను ఆ మహిళ దగ్గరనుంచి విడిపించారు. అనంతరం దీపికగా అసహనంగా అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఈ వీడియోని ఓ ఫోటోగ్రాఫర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ’83’ సినిమాలో దీపిక తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి కనిపించనుంది. అలాగే షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ చిత్రం షూటింగ్ కోసం దీపిక త్వరలో దుబాయ్ వెళ్లనుంది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
Rakhi Sawant : రాఖీసావంత్‌కు అండగా సల్మాన్ ఖాన్.. దేవుడిచ్చిన సోదరుడు అంటూ ఎమోషనల్ అయిన నటి..
Priya Prakash Varrier : కన్ను గీటి కుర్రాళ్లందరినీ తన మత్తులో పడేసి.. తాను మాత్రం ఇలా పడిందేంటి..!