AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Sharma And Virat Kohli : పెళ్ళిసమయంలో అనుష్కశర్మ చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..

ఒక యాడ్ షూటింగులో పరిచయమైన విరాట్, అనుష్క తర్వాత ప్రేమికులుగా మారారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు.

Anushka Sharma And Virat Kohli : పెళ్ళిసమయంలో అనుష్కశర్మ చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 27, 2021 | 2:51 PM

Anushka Sharma And Virat Kohli : ఒక యాడ్ షూటింగులో పరిచయమైన విరాట్, అనుష్క తర్వాత ప్రేమికులుగా మారారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మల ప్రేమాయణం అప్పట్లో జనాలకు చాలా ఆసక్తికర అంశంగా ఉండేది. ఈ జంటను ‘విరుష్క’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. దాదాపు నాలుగేళ్ల ప్రేమయాణం తర్వాత కోహ్లి, అనుష్క 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అయితే మొదట్లో ఈ ఇద్దరి పెళ్లి పైన అనేక ఊహాగానాలు వినిపించాయి. ఒకానొక  సందర్భంలో విరాట్ కోహ్లీ తన ప్రేమ కథ చెప్తూ.. ఓ షాంపూ యాడ్ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో అనుష్కను తాను తొలిసారి కలిశానని కోహ్లీ చెప్పాడు. ”ఆ యాడ్ షూటింగ్ మూడు రోజులు జరిగింది. అనుష్కతో కలిసి ఆ యాడ్ చేయాల్సి ఉంటుందని నా మేనేజర్ వచ్చి చెప్పాడు. నాకు టెన్షన్ పట్టుకుంది. ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అయిన అనుష్క పక్కన నేనెలా చేయగలుగుతా అని మేనేజర్‌తో అన్నా. ఏం ఫర్వాలేదని, యాడ్ స్క్రిప్ట్ కూడా బాగుందని అతడు చెప్పాడు. అయినా, నాలో టెన్షన్ తగ్గలేదు” అని  చెప్పుకొచ్చాడు. తమ ఇద్దరి కెరీర్లు ఒకేసారి మొదలయ్యాయని, ఇద్దరం ఒకే తరహా కుటుంబాల నుంచి వచ్చామని కోహ్లీ చెప్పాడు. తమ పెళ్లి ఏర్పాట్లంతా అనుష్కనే దగ్గరుండి చూసుకుందని, తాను అప్పుడు ఓ క్రికెట్ సిరీస్ మధ్యలో బిజీగా ఉన్నానని వివరించాడు.

అయితే అదే సమయంలో మీడియా హడావిడి ఎక్కువగా ఉండటంతో అనుష్క ఓ ఫేక్ ఈమెయిల్ ఐడిలను క్రియేట్ చేసిందంట అనుష్క. విరాట్ కు బదులు రాహుల్ అనే పేరుతో పెళ్లిపనులను పూర్తి చేసిందంట. ఈ విషయాన్నీ అనుష్క ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. విరాట్ కూడా తన సతీమని చాలా చక్కగా పెళ్లిపనులను చూసుకుంది అని కితాబు ఇచ్చాడు. ఇక  విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇప్పుడు పుత్రికోత్సాహంలో ఉన్నారు. ఇటీవలే  విరుష్క జంటకు అమ్మాయి పుట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

JD on Soundarya : సౌందర్యతో పెళ్లిని రిజెక్ట్ చేశా… అంటున్న మల్టీటాలెంటెడ్ పర్సన్ ఎవరో తెలుసా..!

Pooja Hegde : ఆ స్టార్‌‌‌‌‌‌తో నటించే ఛాన్స్ రావాలని ఆశిస్తున్నానంటున్న బుట్టబొమ్మ.. ఇంతకు ఆ హీరో ఎవరంటే..