AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD on Soundarya : సౌందర్యతో పెళ్లిని రిజెక్ట్ చేశా… అంటున్న మల్టీటాలెంటెడ్ పర్సన్ ఎవరో తెలుసా..!

నటుడు అంటే ఒకే పాత్రలో నటిస్తా అని గిరి గీసుకోకుండా అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. అయితే అలా ఏ క్యారెక్టర్ లో నటించినా ప్రేక్షకుల మనసుని రంజింపజేయాల్సి ఉంటుంది. అలాంటి యాక్టర్ ను ప్రేక్షకులు ఇష్టపడతారు ఇమేజ్ కు అతీతంగా ఆదరిస్తారు. అటువంటి యాక్టర్ లో ఒకరు జేడీ ..

JD on Soundarya : సౌందర్యతో పెళ్లిని రిజెక్ట్ చేశా... అంటున్న మల్టీటాలెంటెడ్ పర్సన్ ఎవరో తెలుసా..!
Surya Kala
|

Updated on: Feb 27, 2021 | 2:08 PM

Share

JD on Soundarya : నటుడు అంటే ఒకే పాత్రలో నటిస్తా అని గిరి గీసుకోకుండా అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. అయితే అలా ఏ క్యారెక్టర్ లో నటించినా ప్రేక్షకుల మనసుని రంజింపజేయాల్సి ఉంటుంది. అలాంటి యాక్టర్ ను ప్రేక్షకులు ఇష్టపడతారు ఇమేజ్ కు అతీతంగా ఆదరిస్తారు. అటువంటి యాక్టర్ లో ఒకరు జేడీ చక్రవర్తి.. అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. 1989 లో వచ్చిన శివ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జె.డి శివ సినిమా తర్వాత విలన్ పాత్రలో నటించినా.. గులాబీ వంటి సినిమాలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఏ పాత్రలో నటించినా జే.డీ. చక్రవర్తి పర్ఫార్మెన్స్ మాత్రం ఆ పాత్రకి న్యాయం చేసేలాగా ఉంటుంది.

ఇటీవల జేడీ నటించిన ఎమ్ ఎమ్ ఓ ఎఫ్ రిలీజ్ సందర్భంగా దివంగత హీరోయిన్ సహజనటి సౌందర్య గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. తనకు సౌందర్య తో పెళ్లి చేయాలనీ సినీ ఇండస్ట్రీ లో ప్రముఖులు ప్రయత్నించారని చెప్పి.. అందరికీ షాక్ ఇచ్చాడు జేడీ. ప్రేమకు వేళాయరా సినిమాలో జేడీ, సౌందర్య లు కలిసి నటించారు. ఆ సమయంలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, కెమెరా మ్యాన్ శరత్, పాటల రచయిత చంద్రబోస్ భార్య సుచిత్ర కలిసి తనకు, సౌందర్యకు పెళ్లి చేయాలనుకున్నారని చెప్పాడు.

తన వద్ద పెళ్లి ప్రవస్తావన తీసుకుని రాగా తాను అంగీకరించలేదన్నాడు జేడీ. ఇద్దరం పెళ్లి చేసుకుంటే.. తమ మధ్య ఉన్న వృత్తిపరమైన రిలేషన్ పాడవుతుంది అందుకనే సౌందర్యంతో పెళ్లి వద్దన్నాని అన్నాడు చక్రవర్తి. అంతేకాదు ఆ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య కు తనకు చిన్న చిన్న విషయాల్లో మనస్పర్థలు వచ్చాయని చెప్పాడు. ఇక కొన్నేళ్ళకు అవి తగ్గి మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అయ్యామని అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు.

ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ వర్మ స్కూల్ నుంచి వచ్చినవాడే. 1989 లో వచ్చిన శివ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తర్వాత నేటి సిద్ధార్థ, శ్రీవారి చిందులు, అతిరథుడు, రక్షణ, ఆదర్శం ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. వర్మ శిష్యుడు శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన మనీ మూవీతో జెడి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక 1998 లో వచ్చిన సత్య సినిమా.. జె.డి.చక్రవర్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. జెడి చక్రవర్తి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించాడు .  మనీ మనీ, గులాబి, అనగనగా ఒక రోజు, దెయ్యం , బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయరా.. వంటి సినిమాల్లో నటించాడు. అలాగే మనీ మనీ మోర్ మనీ, సిద్ధం, డర్నా జరూరీ హై, దర్వాజా బంద్ రఖో, హోమం, దుర్గ, ఆల్ ది బెస్ట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

పాపే నా ప్రాణం సినిమా కూడా జెడి నిర్మించాడు. 2016 లో జె.డి.చక్రవర్తి, లక్నోకి చెందిన అనుకృతి గోవింద్ శర్మని వివాహం చేసుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన శ్రీదేవి సినిమాలో అనుకృతి నటించింది. పైగా ఈ సినిమాకి జె.డి.చక్రవర్తి దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదట. అయితే ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

Also Read :

సోషల్ మీడియా, ఓటీటీ చట్టంలో కొత్త మార్గదర్శకాలు.. కొత్త నిబంధనలను ఎందుకోసం? ఎవరికోసం?

ఆ స్టార్‌‌‌‌‌‌తో నటించే ఛాన్స్ రావాలని ఆశిస్తున్నానంటున్న బుట్టబొమ్మ.. ఇంతకు ఆ హీరో ఎవరంటే..