Sunny Leone: వివాదంలో చిక్కుకున్న సన్నీ సాంగ్.. మనో భావాలు దెబ్బ తిన్నాయంటున్నా పూజారులు.. అసలు విషయం ఏంటంటే..
సన్నీ లియోన్ నటించిన లేటెస్ట్ మ్యూజిక్ వీడియో వివాదంలో చిక్కుకొంది. ఈ పాటలో హిందూ దేవత రాధ పేరుని బూతు పాటకు వాడుకున్నారని,

Sunny Leone: సన్నీ లియోన్ నటించిన లేటెస్ట్ మ్యూజిక్ వీడియో వివాదంలో చిక్కుకొంది. ఈ పాటలో హిందూ దేవత రాధ పేరుని బూతు పాటకు వాడుకున్నారని, ఇది హిందూ దేవతల మనో భావాలు దెబ్బ తినేలా ఉన్నాయని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు సంగతేమో కానీ ఈ మధ్య కాలంలో సినిమాలో సన్నివేశాలు, పాటలు, మాటలు ఇలా ఏదో ఒక అంశం తరచుగా వివాదాస్పదమవుతూనే ఉన్నాయి.. మేకర్స్ కావాలనే వివాదాస్పద అంశాలను తీసుకుంటున్నారో.. లేక ప్రజలే ప్రతిదాన్ని తమకు అన్వయించుకుంటున్నారో కానీ.. మనోభావాలు దెబ్బతినడం అనే మాట ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తుంది.
బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీలియోన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సన్నీ పాట ఒకటి ఇప్పుడు వివాదాస్పదమవుతుంది.సన్నీలియోన్ నటించిన ‘మధుబన్ మే రాధిక నాచే’ వీడియో ఆల్బమ్ విడుదలైంది. డిసెంబర్ 22న విడుదల చేసిన ఈ సాంగ్ లో సన్నీ హాట్ హాట్‌గా పర్ఫామెన్స్ ఇచ్చింది. పాట కూడా వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది. ఉత్తర ప్రదేశ్‌లోని మధురకు చెందిన పూజారులు పాటపై అభ్యంతరం వ‍్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆల్బమ్‌ను నిషేధించాలని మండిపడుతున్నారు.
ఈ పాటలో సన్నీ లియోన్ చేసిన అశ్లీల నృత్యం తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. సన్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆల్బమ్‌ను నిషేధించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాసిన లిరీక్స్ ను బట్టి చూస్తే రాధ మధుబన్ లో నాట్యం చేసినట్లుగా ఉంటుందని, అయితే రాధ నర్తకి కాదు.. భక్తురాలంటున్నారు. అలాగే మధుబన్ పవిత్ర ప్రదేశమన్న అర్చకులు… రాధ మధుబన్ లో ఇలా డ్యాన్స్ చేయలేదన్నారు. అందుకే అర్చక సంఘాలు, హిందూ సంఘాలు ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :




