Sushant Singh Rajput Death Anniversary: ఇంకా వీడని మిస్టరీ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వర్ధంతి నేడు..
సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదగడం ఇష్టం లేనివారు
టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించాడు ఓ యంగ్ కుర్రాడు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు.. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు (Sushanth Singh Rajputh). ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలనేది ఈ హీరో లక్షణం.. తనతోపాటు కలిసి నటించిన కథానాయికలకు గౌరవం ఇవ్వడం.. సాధారణ జనాలు.. అభిమానులతో సులభంగా కలిసిపోయి ఉంటాడు.. తన నటన.. టాలెంట్‌తో ఇండస్ట్రీలో తన ఉనికిని కాపాడుకున్నాడు.. మొదటి సినిమాతోనే యూత్‌లో భారీగా ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు.. అమ్మాయిల ఫెవరేట్ క్రష్‌గా.. ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానాన్ని నిల్చున్న ఆ హీరో ఈ లోకాన్ని విడిచి నేటికి రెండేళ్లు… ఇప్పటికీ అతని మృతిపై నెలకొన్న అనుమానాలకు మాత్రం స్పష్టమైన నిర్థారణ రాలేదు.. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థమైందనుకుంటాను.. అతనే.. బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు (జూన్ 14న) 2020న తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..
చిన్న వయసులోనే ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరో ఆకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడం ఇటు ప్రేక్షకులకే కాదు.. సినీ ప్రముఖులు షాక్ కు గురిచేసింది.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదగడం ఇష్టం లేనివారు సుశాంత్ ను చంపేశారని కొందరు ఆరోపించగా.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని మరికొందరు వాపోయారు.. దీంతో నెపోటిజం తెరపైకీ వచ్చింది.. సుశాంత్ సింగ్ ను మానసికంగా ఒత్తిడికి గురిచేశారని.. ఆ కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి.. అలాగే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం.. అతని ఒంటిపై స్వల్ప గాయాలు ఉండడం కూడా పలు అనుమానాలను రేకెత్తించింది. ఆయన మరణంపై పోలీసుల విచారణలో అవకతవకలు జరిగాయని. కావాలనే సుశాంత్ ఆత్మహత్యపై పోలీసుల విచారణ జాప్యం జరిగిందంటూ వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి.. సుశాంత్ మరణించి రెండేళ్లు అయినప్పటికీ అతని మరణంపై స్పష్టమైన ఆధారాలు లభించకపోవడం అభిమానులను కలచివేస్తుంది. పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన సుశాంత్.. తన సినిమాలతో ఇప్పటికీ అభిమానుల మనసులలో సజీవంగా ఉన్నాడు..