AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: కామినేని హాస్పిటల్‌‌లో చేరిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆగిన ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్.. అసలేమైందంటే?

షూటింగ్ సమయంలో దీపిక అస్వస్తకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా ప్రొడక్షన్ టీం షూటింగ్‌ను కూడా ఆపివేసింది.

Deepika Padukone: కామినేని హాస్పిటల్‌‌లో చేరిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆగిన 'ప్రాజెక్ట్ కె' షూటింగ్.. అసలేమైందంటే?
Venkata Chari
|

Updated on: Jun 14, 2022 | 5:24 PM

Share

Prabhas Project K: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో అస్వస్తతకు గురయ్యారు. దీంతో ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చేరిన దీపిక.. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపిక హోటల్ నోవాటెల్‌కు చేరుకుంది. షూటింగ్ సమయంలో ఆమె ఇక్కడే ఉండిపోయింది. ఆమెకు నోవాటెల్‌లో వైద్య సహాయం అందించారు. కాగా, ప్రస్తుతం దీపిక హైదరాబాద్‌లో ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. షూటింగ్ సమయంలో దీపిక గుండె వేగం ఒక్కసారిగా పెరగడంతో, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా ప్రొడక్షన్ టీం షూటింగ్‌ను కూడా ఆపివేసింది.

ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు భాగం కానున్నారు. ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్‌ను హైదరాబాద్‌లో వేశారు. ‘ప్రాజెక్ట్ కె’లో దీపికతోపాటు అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని పూర్తి విఎఫ్ఎక్స్‌తో నిర్మించనుంది. ఈ సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది.

డిప్రెషన్‌లో దీపికా పదుకొణె..

ఇవి కూడా చదవండి

2015లో దీపికా పదుకొణె డిప్రెషన్‌కు గురైనట్లు వెల్లడించింది. ఆమె మానసిక వ్యాధికి సంబంధించి నిపుణుల సహాయం తీసుకుంటోంది. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన ఆమె.. ఈ వ్యాధి తనకు చేదు అనుభవమని చెప్పుకొచ్చింది. అయినా తన అనారోగ్యాన్ని దాచుకోలేదు. దీపికా తన మానసిక ఆరోగ్యం గురించి ప్రజలతో మాట్లాడడమే కాకుండా, చాలా మందికి దీని గురించి సమాచారం ఇచ్చింది.

2018లో పెళ్లి..

కాగా, ప్రస్తుతం దీపికా పదుకొణె డిప్రెషన్ నుంచి బయటపడింది. నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన ఆమె.. 2018లో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌ను పెళ్లాడింది.

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ