AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అండర్ వరల్డ్ డాన్‏తో ప్రేమ.. 17 ఏళ్లు పెద్దవాడైన డైరెక్టర్‏తో పెళ్లి.. దేశం విడిచి పారిపోయిన హీరోయిన్..

సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొని నిలబడతారు. కానీ ఆ స్టార్ డమ్ కాపాడుకోలేకపోతారు. ప్రేమ, రిలేషన్ షిప్స్ మాయలోపడి కెరీర్ నాశనం చేసుకున్న సినీతారలు చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఒకరు.

Tollywood: అండర్ వరల్డ్ డాన్‏తో ప్రేమ.. 17 ఏళ్లు పెద్దవాడైన డైరెక్టర్‏తో పెళ్లి.. దేశం విడిచి పారిపోయిన హీరోయిన్..
Sonam Khan
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2024 | 12:36 PM

Share

1989లో విడుదలైన ‘త్రిదేవ్’ సినిమాలోని ‘తిర్చీ టోపీ వాలే, బాబూ భోలే భలే,..తూ యాద్ ఆనే లగా హై’ పాట గుర్తుండే ఉంటుంది. ఇందులో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సోనమ్ బక్తావన్. ఈ పాటతోనే సినీరంగంలో చాలా ఫేమస్ అయ్యింది. ‘త్రిదేవ్’లోని ఈ పాపులర్ సాంగ్‌లో నటి సోనమ్ బక్తావార్ నసీరుద్దీన్ షాతో కలిసి కనిపించింది. ఈ పాట పాపులారిటీ సోనమ్‌ను రాత్రికి రాత్రే పరిశ్రమలో స్టార్ హీరోయిన్ ను చేసింది. కానీ ఎంత తక్కువ సమయంలో సక్సెస్ అయ్యిందో.. అంతే తక్కువ సమయంలో ఆమె కెరీర్ నాశనం అయ్యింది. నటి సోనమ్ బక్తావర్ ఖాన్ 16-17 సంవత్సరాల వయస్సులో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. తొలి చిత్రంలోనే అనేక బోల్డ్ సన్నివేశాల్లో నటించి ఒక్కసారిగా పరిశ్రమలో సంచలనం సృష్టించింది.

సోనమ్ 1988లో యష్ చోప్రా చిత్రం ‘విజయ్’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఈ సినిమాలో తన నటనకు ఆమె చాలా ప్రశంసలు అందుకుంది. ఆ రోజుల్లో సోనమ్‌ని తమ సినిమాల్లో ఎంపిక చేయాలనేది ప్రతి సినిమా నిర్మాతల కల. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించింది. ‘విజయ్’, ‘త్రిదేవ్’, ‘విశ్వాత్మ’ వంటి హిట్స్ అందుకున్న సోనమ్ ఇండస్ట్రీలో బోల్డ్ నటిగా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ హఠాత్తుగా 19 ఏళ్ల వయసులో తనకంటే 17 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు రాజీవ్‌ని పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీరిద్దరి వివాహం పెద్ద చర్చగా మారింది. మీడియా కథనాల ప్రకారం, త్రిదేవ్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడిపోయారు. ఆ రోజుల్లో సోనమ్ పేరు అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం ప్రేమలో ఉన్నారని ప్రచారం నడిచింది.

అటువంటి పరిస్థితిలో తన కెరీర్, ఇమేజ్ దెబ్బతినకుండా కాపాడుకోవడానికి ఈ హీరోయిన్ తన కంటే 17 సంవత్సరాలు పెద్ద దర్శకుడిని వివాహం చేసుకుని, రాత్రికి రాత్రే దేశం విడిచిపెట్టి వెళ్లిపోయింది. వివాహం తర్వాత కూడా సోనమ్, డాన్ అబూ సలేం పేర్లు వినిపించాయి. దీంతో ఆమె 4 వేర్వేరు దేశాలలో నివసించింది.