Anjali Varmora: ఎంత పనిచేశావు తల్లి! చిన్న వయసులోనే ప్రముఖ మోడల్ ఆత్మహత్య.. కారణమిదే
అంజలి వర్మోరా తన ఇంట్లో నే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. గదిలోకి వెళ్లిన అంజలి ఎంతకీ బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే అంజలి ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ మోడల్ ఆత్మహత్య చేసుకుంది. ఇరవై మూడేళ్ల అంజలి వర్మోరా తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆత్మహత్య అని తేలింది. మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం అంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అంజలి ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అయితే, అంజలి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంజలి ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు. బంధువుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. అంజలి వెర్మోరా చాలా ఏళ్లుగా మోడలింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అంజలిని చాలా మంది ఫాలో అవుతున్నారు.
అంజలి గత కొన్ని రోజులుగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆమె గత కొన్ని రోజులుగా ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తోంది. ‘నీకు నేను ఏమీ కానని ఈ రోజే తెలిసింది’ అంటూ ఓ పోస్టు పెట్టింది. మరో పోస్టులో .. ‘మనం అన్నీ కోల్పోయినా అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ, ప్రేమను కోల్పోతే మాత్రం అది చాలా బాధిస్తుంది’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. కాగా పోలీసులు అంజలి బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు. అతను దొరికితే అంజలి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
అంజలి వర్మోనా ఆఖరి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ఇదే..
View this post on Instagram
అంజలి వర్మోరా కు ఇన్ స్టా లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.