Tollywood: ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?.. టాలీవుడ్ కాదు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?.. తను పటౌడీ క్వీన్ సారా అలీ ఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి. ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. 1995 ఆగస్ట్ 12న ముంబైలో జన్మించింది సారా అలీ ఖాన్.
కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన సారా.. 2018లో కథానాయికగా కెరీర్ ఆరంభించింది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన కేదార్ నాథ్ చిత్రంతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు.. ఉత్తమ ఫీమేల్ ఎంట్రీకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. అలాగే ఇదే సినిమాకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్ అందుకుంది.




ఆ తర్వాత సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ 1 చిత్రంలో నటించింది. 2021లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ఆత్రాంగి రే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో సారా క్రేజ్ ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ పెరిగిపోయింది. ఇటీవల విక్కీ కౌశల్ తో జంటగా జరా హాట్కే జరా బచ్కే చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది సారా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.