AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చెల్లెలితో ఉన్న ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో తెలుసా.. ? ఆ స్టార్ నటుడి కూతురు ఇప్పుడు టాప్ హీరోయిన్..

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా నెట్టింట చైల్డ్ హుడ్ మెమొరీస్ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. చెల్లెలికి ఫుడ్ తినిపిస్తున్న ఆ క్యూట్ బుజ్జాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అలాగే సీనియర్ నటుడి ముద్దుల కూతురు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగ ప్రవేశం చేసిన ఈ తార.. ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: చెల్లెలితో ఉన్న ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో తెలుసా.. ? ఆ స్టార్ నటుడి కూతురు ఇప్పుడు టాప్ హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2024 | 7:41 PM

Share

సోషల్ మీడియాలో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్,వీడియోస్ వైరలవుతుంటాయన్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ స్టార్ త్రోబ్యాక్ ట్రెండ్ వైరలవుతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా నెట్టింట చైల్డ్ హుడ్ మెమొరీస్ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. చెల్లెలికి ఫుడ్ తినిపిస్తున్న ఆ క్యూట్ బుజ్జాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అలాగే సీనియర్ నటుడి ముద్దుల కూతురు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగ ప్రవేశం చేసిన ఈ తార.. ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా ?.. ఆ బుజ్జాయి మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ అనన్య పాండే. బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 30 అక్టోబర్ 1998న జన్మించింది ఈ బ్యూటీ. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె ఆమె తల్లి భావన పాండే ఫ్యాషన్ డిజైనర్.

అనన్య పాండే ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. 2017లో, అనన్య పారిస్‌లో జరిగిన వానిటీ ఫెయిర్ యొక్క లే బాల్ డెస్ డెబ్యూటాంటెస్ ఈవెంట్‌లో పాల్గొంది. అనన్య ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. 2019 సంవత్సరంలో కరణ్ జోహార్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘పతి పత్నీ ఔర్ వో’లో కనిపించింది. 2022లో సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ సినిమాలో నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత బీటౌన్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘డ్రీమ్ గర్ల్ 2’లో కనిపించింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనన్య గత రెండేళ్లుగా హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోయారని ప్రచారం నడిస్తుంది. ఈరోజు తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేయడంతో బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.