AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : భార్యకు 380 కోట్లు ఇచ్చి విడాకులు.. తనకంటే 11 ఏళ్ల చిన్న హీరోయిన్‏తో 51 ఏళ్ల హీరో డేటింగ్..

సినీరంగ ప్రపంచంలో ఇప్పుడు లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు కామన్ అయ్యాయి. సంవత్సరాల వైవాహిక బంధానికి ముగింపు పలికి మరో జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నారు. స్టార్ హీరోహీరోయిన్లు తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొన్నాళ్లకే మనస్పర్థలతో విడిపోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్టార్ హీరో తన భార్యకు రూ.380 కోట్లు ఇచ్చి విడాకులు తీసుకుంటున్నారు.

Actor : భార్యకు 380 కోట్లు ఇచ్చి విడాకులు.. తనకంటే 11 ఏళ్ల చిన్న హీరోయిన్‏తో 51 ఏళ్ల హీరో డేటింగ్..
Hrithik Roshan
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2025 | 5:29 PM

Share

ఈరోజుల్లో సినిమా పరిశ్రమలో విడాకులు చాలా సాధారణ విషయంగా మారాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల ఇండస్ట్రీలలో స్టార్ సెలబ్రెటీ కపుల్స్ డివోర్స్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే సినీరంగంలో అత్యధిక ఖరీదైన విడాకుల గురించి తెలుసా.. ? అవును.. ఇండస్ట్రీలోనే అత్యంత రిచెస్ట్ డివోర్స్. తన భార్యకు రూ.380 కోట్ల భరణం ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఇప్పుడు తనకంటే 11 సంవత్సరాలు చిన్న అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అతడు మరెవరోకాదు.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. అతడు కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సుస్సాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెహాన్, రిధాన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

వీరిద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ 14 సంవత్సరాల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో వీరిద్దరి డివోర్స్ పెద్ద చర్చే జరిగింది. నివేదికల ప్రకారం హృతిక్ సుహానే ఖాన్ కు భారీ మొత్తంలో భరణం చెల్లించాడట. ఆమె అప్పట్లో 400 కోట్ల భరణం డిమాండ్ చేయగా.. హృతిక్ రూ.380 కోట్లు భరణం చెల్లించినట్లు సమాచారం. దీంతో వీరిద్దరి డివోర్స్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు అని అంటుంటారు.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

విడాకుల తర్వాత వీరిద్దరు ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు. కానీ తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హృతిక్ రోషన్ బాలీవుడ్ హీరోయిన్ కమ్ సింగర్ సబా ఆజాద్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. హృతిక్ కంటే సబా 11 సంవత్సరాలు చిన్నది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

Follow Us