Zubeen Garg Death: యా అలీ సింగర్ జుబిన్ గార్గ్ మృతి.. స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం..
ప్రముఖ చలన చిత్ర గాయకుడు "యా అలీ" ఫేమ్ జుబీన్ గార్గ్ కన్నుమూశారు. ఈశాన్య ఉత్సవంలో పాల్గొనేందుకు సింగపూర్‌లో వెళ్ళిన ఆయన.. స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. జుబీన్ గార్గ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత జుబీన్ అభిమానులు షాక్ అయ్యారు.

చలన చిత్ర పరిశ్రమలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ అస్సామీ గాయకుడు ప్రమాదంలో గాయపడి మరణించాడు. ఈ మరణ వార్త విన్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రఖ్యాత అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్ లో మరణించారు. కొంతకాలం క్రితం ఆయన ఈశాన్య ఉత్సవంలో పాల్గొనడానికి సింగపూర్‌కు వెళ్లారని.. అక్కడ ఆయన స్కూబా డైవింగ్ చేసే సమయంలో ప్రమాదానికి గురయ్యారనే వార్తలు వినిపించాయి. దీని తరువాత జుబీన్ గార్గ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జుబిన్ మరణించాడు. ఈ వార్త విన్న అతని అభిమానులు షాక్ అయ్యారు. ఈ విషాద వార్తని మొదట్లో ఎవరూ నమ్మలేదు. ప్రమాదం తర్వాత జుబిన్‌ను ఐసియులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అతను నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం
మీడియా నివేదికల ప్రకారం జుబిన్ స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. జుబిన్‌ను కాపాడటానికి వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. అయినా అతన్ని కాపాడలేకపోయారు.
సినీ గాయకుడిగా ప్రయాణం
జుబిన్ గాయకుడిగా ప్రయాణం గురించి చెప్పాలంటే.. అసాధారణ గాయకుడిగా ఖ్యాతిగాంచాడు. అంతేకాదు నటుడు, రచయిత కూడా. జుబిన్ నవంబర్ 18, 1972న మేఘాలయలో జన్మించాడు. అస్సామీలతో పాటు, జుబిన్ బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మరాఠీ, మిసింగ్, నేపాలీ, ఒడియా, సంస్కృతంతో సహా దాదాపు 60 భాషలలో పాటలు పాడాడు.
బాలీవుడ్‌లో కూడా అనేక పాటలు
కంగనా రనౌత్, ఇమ్రాన్ హష్మి, షైనీ అహుజా చిత్రం గ్యాంగ్‌స్టర్ కోసం పాడిన యా అలీ సాంగ్ ఫేమస్ అయింది. జుబిన్ కు దాదాపు 12 రకాల సంగీత వాయిద్యాలను ఉపయోగించడం తెలుసు. జుబిన్ పూర్తి పేరు జుబిన్ బోర్తాకూర్ గార్గ్. 1995లో జుబిన్ ముంబైకి వచ్చి తన మొదటి ఇండిపాప్ సోలో ఆల్బమ్ చాందిని రాత్‌తో సింగర్ గా కెరీర్ ప్రారంభించాడు. దిల్ సే (1998), డోలి సజాకే రఖ్నా (1998), ఫిజా (2000), కాంటే (2002) వంటి అనేక బాలీవుడ్ చిత్రాల్లో పాటలు పాడాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








