Ananya Panday: ఎన్సీబీ అధికారుల ముందు అనన్య పాండే.. డ్రగ్స్ వ్యవహారం పై కొనసాగుతున్న విచారణ..
బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది ఈ వ్యవహారంలో చిక్కుకున్నారు.
Ananya Pandey: బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది ఈ వ్యవహారంలో చిక్కుకున్నారు. హిందీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో డ్రగ్స్ వినియోగిస్తున్నరంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత మరోసారి డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఈ కేసులో అరెస్ట్ కూడా చేశారు ఎన్సీబీ అధికారులు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ సారి ఈ కేసులో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చిక్కుకున్నాడు. ఇప్పటికే ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంతో ఇంకెంతమందికి లింకులు ఉన్నాయన్న కోణంలో విచారిస్తున్నారు. అయితే ఆర్యన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ అనన్య పాండే పేరు ఇప్పడు బయటకు వచ్చింది.
నిన్న అనన్యతో పాటు షారుఖ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు..అనన్య, ఆర్యన్ మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలనాటి హీరో చుంకీ పాండే కూతురైన అనన్య..షారూఖ్ తనయుడు ఆర్యన్‌కు క్లోజ్ ఫ్రెండ్. ఆర్యన్‌తో అనన్య డ్రగ్స్‌పై వాట్సాప్ చాట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఓ యువనటితో ఆర్యన్.. డ్రగ్స్ గురించి వాట్పాప్‌లో చాటింగ్ చేసినట్టు ముంబై కోర్టుకు ఆధారాలు సమర్పించారు ఎన్సీబీ అధికారులు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాట్‌లో అనన్య పేరు ఉండటంతో ఆమె ను విచారణకు పిలిచారు అధికారులు. ఈ క్రమంలో నేడు విచారణకు హాజరయ్యింది అనన్య. కొద్దిసేపటి క్రితం అనన్య ఎన్సీబీ ఆఫీస్‌కు చేరుకుంది. డ్రగ్స్ వ్యవహారంతో అనన్యకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి.? ఆమె కూడా డ్రగ్స్ తీసుకునేదా..? ఆర్యన్ ఖాన్ చాట్‌లో ఆమె పేరు ఎందుకు ఉంది.?డ్రగ్ డీలర్స్‌తో ఏమైనా లావాదేవీలు జరిపిందా.? అనే కోణంలో ఎన్సీబీ అధికారులు అనన్యను విచారిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :