AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonakshi Sinha: జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా మతం మార్చుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ మతాంతర వివాహం చేసుకున్నారు. కాబట్టి సహజంగా మతమార్పిడి ప్రశ్నలు తలెత్తుతాయి. అందుకు తగ్గట్టుగానే సోనాక్షి సిన్హా మతం మార్చుకుంటుందని ప్రచారం జరగుతోంది. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది సోనాక్షి. అలాగే కుటుంబం గురించి కొన్ని విషయాలను పంచుకుంది.

Sonakshi Sinha: జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా మతం మార్చుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Bollywood Actress Sonakshi
Basha Shek
|

Updated on: Feb 28, 2025 | 9:52 AM

Share

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వివాహం గురించి పలు రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి . ఆమె తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతోందని తెలుసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు. అంతేకాదు ఈ వివాహానికి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా అంగీకరించలేదని కూడా ప్రచారం. కానీ శతృఘ్న సిన్హా కూడా వివాహానికి హాజరు కావడంతో అన్ని ఊహాగానాలకు తెరపడింది. ఇప్పుడు, ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోనాక్షి సిన్హా తన మ్యారేజ్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సోనాక్షి సిన్హా హిందూ మతానికి చెందినది. ఆమె భర్త జహీర్ ఇక్బాల్ ఒక ముస్లిం. ఈ క్రమంలోనే సోనాక్షి సిన్హా వివాహం తర్వాత ఇస్లాం మతంలోకి మారతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఖండించింది సోనాక్షి. ‘ మా ఇద్దరి మధ్య మతం మార్పిడి ప్రశ్న ఎప్పుడూ రాలేదు. మేం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. అంతే చాలు. ‘మేము మతాన్ని మాత్రమే చూడము.’ ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ మతాన్ని నా మీద రుద్దలేదు. అలాగే, నేను నా మతాన్ని వారిపై రుద్దలేదు. మేము మతం గురించి అస్సలు చర్చించం. మేమిద్దరం దాని గురించి అసలు మాట్లాడుకోం’ అని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.

“మతం గురించి మాట్లాడటానికి బదులుగా, మేము ఒకరి సంస్కృతిని గౌరవిస్తాం. అర్థం చేసుకుంటాము.” వారు తమ ఇంట్లో కొన్ని సంప్రదాయాలను పాటిస్తారు. నాకు నా స్వంత సంప్రదాయాలు ఉన్నాయి. నేను వారి సంప్రదాయాన్ని గౌరవిస్తాను. వాళ్ళు నా సంస్కృతిని గౌరవిస్తారు. ఇది ఎల్లకాలం కొనసాగుతుంది’ అని సోనాక్షి సిన్హా తెలిపింది. సోనాక్షి సిన్హా తన ప్రేమ గురించి తన తండ్రి శత్రుఘ్న సిన్హాకు మొదటిసారి చెప్పినప్పుడు ఆయన ఇష్టం లేదన్నట్లు తెలిసింది. అయితే తన కూతురి సంతోషం ముఖ్యం కాబట్టి ఈ పెళ్లికి అంగీకరించానని సోనాక్షి ఇప్పుడు తెలిపింది.

ఇవి కూడా చదవండి

భర్తతో సోనాక్షి సిన్హా..

కాగా గతేడాది జూన్ 23న సోనాక్షి, జహీర్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాకముందు ఇద్దరూ ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. కాగా పెళ్లి తర్వాత సోనాక్షి, జహీర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తు హై మేరీ కిరణ్’. దర్శకుడు కరణ్ రావల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా