kangana Ranaut: సౌత్ స్టార్‌లను ఆకాశానికెత్తేసిన కంగనా.. వైరల్ అవుతోన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
kangana Ranaut: నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలవడం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కు అలవాటు. వివాదాలతో సావాసం చేస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. గతలో ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే చిన్న సైజ్ యుద్ధం చేసిన కంగనా తాజాగా...
kangana Ranaut: నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలవడం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కు అలవాటు. వివాదాలతో సావాసం చేస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. గతలో ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే చిన్న సైజ్ యుద్ధం చేసిన కంగనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. సౌత్ ఇండియా స్టార్ హీరోలను ప్రస్తావిస్తూ కంగనా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. సౌత్ ఇండియా యంగ్ సెన్సేషన్ హీరోలు యష్‌తో పాటు అల్లు అర్జున్ ఫోటోలతో కంగానా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఉ ఉ అంటావా అనే సాంగ్‌ను యాడ్ చేశారు కంగనా. ఈ పోస్ట్‌తో పాటు.. సౌత్ కంటెంట్‌తో పాటు సూపర్ స్టార్స్‌లో ఇంతలా ఆవేశం ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
1) ఈ స్టార్ హీరోలు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయారు.
2) ఆ హీరోలు తమ కుటుంబాలను ప్రేమిస్తారు, సంబంధాల విషయంలో వెస్టర్న్ దేశాలను అనుకరించకుండా, వాటిని నిలుపుకుంటారు.
3) వారి వృత్తి నైపుణ్యం, అభిరుచి అసమానమైనది.
అంటూ రాసుకొచ్చారు కంగానా.. ఇక ఈ పోస్టు చివరిలో బాలీవుడ్ ఇండస్ట్రీని ప్రస్తావిస్తూ కాంట్రవర్సీ కామెంట్ చేశారు. సౌత్ హీరోలను బాలీవుడ్ వారు భ్రష్టు పట్టించడానికి అనుమతించకూడదంటూ కంగానా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
New Covid Variant: కనిపించని మరో వేరియంట్ అటాక్.. లైవ్ వీడియో
Akhanda: ఓటీటీలోనూ అఖండ రికార్డ్.. ఫ్యాన్స్ కోసం మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్..