AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హిందువా?ముస్లిమా? అని అడుగుతున్నారు.. అద్దెకు ఇల్లు దొరక్క టాలీవుడ్ హీరోయిన్ ఇబ్బందులు

'ఇంటి యజమానులందరూ నువ్వు హిందువా? ముస్లిమా? అని అడుగుతున్నారు. అలాగే మాంసాహారం తింటావా? లేదా? అని ప్రశ్నలు వేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నానంటే చాలు.. నిర్మోహమాటంగా ఇల్లు లేదంటున్నారు'.. ఇది తెలుగుతో పాటు పలు హిందీ టీవీ సీరియల్స్ లో నటించిన ఓ ప్రముఖ హీరోయిన్ ఆవేదన

Tollywood: హిందువా?ముస్లిమా? అని అడుగుతున్నారు.. అద్దెకు ఇల్లు దొరక్క టాలీవుడ్ హీరోయిన్ ఇబ్బందులు
Actress
Basha Shek
|

Updated on: Jan 22, 2025 | 11:14 AM

Share

బాలీవుడ్ బుల్లితెర నటి, బిగ్ బాస్ 18 కంటెస్టెంట్ యామిని మల్హోత్రా కూడా ముంబైలో అద్దెకు ఇల్లు పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ మేరకు యామిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. తాను యాక్టింగ్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నానని చెప్పడంతో యజమానులు ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు నిరాకరిస్తోందని ఆమె వాపోయింది. అంతేకాదు ‘నువ్వు హిందువా.. ముస్లిమా’ అనే ప్రశ్నలు కూడా అడుగుతున్నారని యామినీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముంబైలో నివసించేందుకు ప్రస్తుతం అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉందంటోందీ అందాల తార. ‘హలో ఫ్రెండ్స్, నా చాలా చేదు అనుభవం గురించి చెబుతున్నాను. నేను ముంబైని ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ ఇక్కడ నివసించడానికి ఇల్లు పొందడం చాలా కష్టం. నేను హిందువునా లేక ముస్లిమా, గుజరాతీనా లేక మార్వాడీనా? అని ఆరా తీస్తున్నారు. పైగా నేను నటిని అని చెప్పగానే నిర్మోహమాటంగా ఇల్లు ఇవ్వమంటున్నారు. నేను నటనా రంగంలో పని చేస్తున్నందున అద్దెకు ఇల్లు పొందే అర్హత నాకు లేదా? 2025లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నందుకు ఆశ్చర్యపోయాను. ఇలాంటి ఆంక్షలు ఉంటే మనం దీన్ని నిజంగా కలల నగరం అని పిలవగలమా’ అని యామినీ తన పోస్టులో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో పలువురు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. ముంబైలో అద్దెకు ఇల్లు పొందడం కూడా అంత ఈజీ కాదని పలువురు తమ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకుంటున్నారు. యామిని కంటే ముందు మరికొందరు నటీనటులు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. ముంబయి లాంటి నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుంటూ కులం, శాఖాహారం, మాంసాహారం అంటూ అనేక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు?

యామినీ మల్హోత్రా లేటెస్ట్ ఫొటోస్..

యామిని నటిగానే కాకుండా ఢిల్లీలో డెంటిస్ట్ కూడా. ఆమె ‘మైన్ తేరీ తు మేరా’, ‘గమ్ హై కిసీ కే ప్యార్ మే’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించింది. ఇది కాకుండా తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘చుట్టాలబ్బాయి’ సినిమాలో ఒక కీలక పాత్రలో యాక్ట్ చేసింది. లేటెస్ట్ గా యామిని ‘బిగ్ బాస్ 18’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది . అయితే కొన్ని వారాల్లోనే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.