Chatrapathi: ‘ఛత్రపతి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్..
2005 సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమాకు బుల్లితెరపై విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. అంతేకాకుండా.. మాస్ హీరోగా డార్లింగ్ కు ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చత్రపతి. 2005 సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమాకు బుల్లితెరపై విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. అంతేకాకుండా.. మాస్ హీరోగా డార్లింగ్ కు ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. 18 ఏళ్ల కిందట తెలుగు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో తెరంగేట్రం చేస్తుండగా.. ఈ రీమేక్ కు వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
హిందీలోనూ ఒరిజినల్ టైటిల్ కొనసాగిస్తున్నారు మేకర్స్. వేసవి కానుకగా ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కండలు తిరిగిన దేహంతో చేతిలో చెంబు పట్టుకుని సముద్రం వైపు తిరిగి కనిపిస్తున్నారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్నారు.




మరీ ఈ సినిమాతో హిందీలో బెల్లంకొండ అబ్బాయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి మరీ. అయితే ఈ సినిమాలో నటించి హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అలాగే ఇందులో నటించే నటీనటుల గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
Action, drama and a whole lot of dhamaka! ? Bringing to you an action-packed remake of #Prabhas & @ssrajamouli’s “Chatrapathi” starring none other than @BSaiSreenivas ?
Written by #VijayendraPrasad, directed by #VVVinayak.#Chatrapathi in cinemas on 12th May, 2023 pic.twitter.com/pEr7uEWUkl
— PEN INDIA LTD. (@PenMovies) March 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.