AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triptii Dimri: స్టార్ హీరో పక్కనే కొత్త బంగ్లా కొన్న యానిమల్ హీరోయిన్.. త్రిప్తి ఇళ్లు ఎన్ని కోట్లుందో తెలుసా..?

ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించినా.. త్రిప్తికే అత్యధిక ఫాలోయింగ్ వచ్చింది. దీంతో ఇప్పుడు హిందీలో త్రిప్తికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అలాగే ఇటు తెలుగులో భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ కూడా వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న త్రిప్తి.. ముంబైలో ఆస్తులు కొనేస్తుందట.

Triptii Dimri: స్టార్ హీరో పక్కనే కొత్త బంగ్లా కొన్న యానిమల్ హీరోయిన్.. త్రిప్తి ఇళ్లు ఎన్ని కోట్లుందో తెలుసా..?
Triptii Dimri
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2024 | 5:21 PM

Share

ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‏గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో ఒకేసారిగా ఫేమస్ అయ్యింది. అందం, అభినయం, గ్లామర్ తో కట్టిపడేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది. కానీ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించినా.. త్రిప్తికే అత్యధిక ఫాలోయింగ్ వచ్చింది. దీంతో ఇప్పుడు హిందీలో త్రిప్తికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అలాగే ఇటు తెలుగులో భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ కూడా వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న త్రిప్తి.. ముంబైలో ఆస్తులు కొనేస్తుందట.

దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామేతను ఫాలో అవుతుంది యానిమల్ హీరోయిన్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న త్రిప్తి.. ముంబైలో సెలబ్రెటీలు ఉండే బాంద్రా ఏరియాకు తన మకాం మార్చేసింది. ముంబైలో రణబీర్ కపూర్, అలియా భట్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నివసించే బాంద్రా ఏరియాలో రెండంతస్తుల బంగ్లాను కొనేసిందట. సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇళ్లు ధర రూ.14 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే స్టాప్ డ్యూటీ కింద రూ.70 లక్షలు ఉంటుంది.. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.30 వేలు చెల్లించిందట. ఇప్పుడు ఈ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

త్రిప్తి డిమ్రి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. కానీ బుల్ బుల్ చిత్రంతోనే ఫేమస్ అయ్యింది. ఇక యానిమల్ సినిమా పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం విక్కీ విద్య కా వో వాలా వీడియో, భుల్ భూలయా 3, బ్యాడ్ న్యూస్, దఢక్ 2లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..