Tollywood: చారడేసి కళ్ల అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా..? బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..

నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఈ రోజు హీరోయిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆమెకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: చారడేసి కళ్ల అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా..? బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..
Actress
Follow us

|

Updated on: Jun 08, 2024 | 9:36 PM

పైన ఫోటోలో చారడేసి కళ్లతో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా..? తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. 40 ఏళ్లు దాటిన ఏమాత్రం తరగని అందంతో కుర్రహీరోయిన్లకు సైతం టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పటికీ తన గ్లామర్ లుక్స్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది. అలాగే సినిమాల్లో కీలకపాత్రలు పోషించేందుకు రెడీగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఈ రోజు హీరోయిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆమెకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.. ? తను మరెవరో కాదండి.. సాగర కన్య అలియాస్ బీటౌన్ బ్యూటీ. శిల్పా శెట్టి.

1993లో బాజీగర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శిల్పా శెట్టి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఆగ్, మెయిన్ ఖిలాడి తు అనారో, ఆవో ప్యార్ కెరన్, మిస్టర్ రోమియో వంటి చిత్లాల్లో నటించింది. హిందీలో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ శిల్పాకు అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది శిల్పా శెట్టి. విక్టరీ వెంకటేశ్ సరసన సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో నటించింది. ఇందులో నీలికళ్లతో ప్రేక్షకులను ఫిదా చేసింది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన శిల్పాకు అనుకున్నంత ఫేమ్ రాలేదు.

ఆ తర్వాత తెలుగులో వీడెవడండీ బాసు, ఆజాద్, భలేవాడివి బాసు వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆవేవి ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే 2009లో శిల్పా ఐపీఎల్ ప్రాంచైజీ పార్ట్నర్ గా ఉన్న రాజ్ కుంద్రాతో నిశ్చితార్థం జరుపుకుంది. ఇక అదే ఏడాది నవంబర్ లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఆ దేశంలో దారుణ పరిస్థితులు.. టమాట కిలో రూ.200, చికెన్‌ రూ.700!
ఆ దేశంలో దారుణ పరిస్థితులు.. టమాట కిలో రూ.200, చికెన్‌ రూ.700!
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా
హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని
హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని
చిన్నారులకు ఈ స్నాక్స్‌ చేసి ఇవ్వండి.. ఎంతో ఇష్టంగా తింటారు..
చిన్నారులకు ఈ స్నాక్స్‌ చేసి ఇవ్వండి.. ఎంతో ఇష్టంగా తింటారు..
అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న వయ్యారి..
అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న వయ్యారి..
45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
'పవన్ బాబాయి కాదు.. పెద్దన్న.. గెలవాలని ప్రేయర్స్ చేశాను'
'పవన్ బాబాయి కాదు.. పెద్దన్న.. గెలవాలని ప్రేయర్స్ చేశాను'
భద్రత విషయంలో తగ్గేదేలే.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు ఫస్ట్‌ ప్లేస్‌
భద్రత విషయంలో తగ్గేదేలే.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు ఫస్ట్‌ ప్లేస్‌
అవికా గోర్‏కు చేదు అనుభవం.. ధైర్యం లేదంటూ..
అవికా గోర్‏కు చేదు అనుభవం.. ధైర్యం లేదంటూ..
TGPSC గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌
TGPSC గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌